సైలెంటైన సీనియర్లు.. ఖర్గే కోర్టుకు తెలంగాణ కాంగ్రెస్ పంచాయతి
విధాత: జాతీయ కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ వచ్చిన వెళ్లిన తరువాత సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్‌లకు వ్యతిరేకంగా సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టిన నాయకులంతా తమ సమస్యను ఢిల్లీ పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ ముదిరిన విషయం తెలిసిన వెంటనే ఏఐసీసీ తీవ్రంగా స్పంధించింది. పంచాయతీ పరిష్కారానికి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపింది. బాధ్యతలు […]

విధాత: జాతీయ కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్ వచ్చిన వెళ్లిన తరువాత సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్‌లకు వ్యతిరేకంగా సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టిన నాయకులంతా తమ సమస్యను ఢిల్లీ పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ ముదిరిన విషయం తెలిసిన వెంటనే ఏఐసీసీ తీవ్రంగా స్పంధించింది.
పంచాయతీ పరిష్కారానికి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌కు పంపింది. బాధ్యతలు తీసుకున్న వెంటనే డిగ్గిరాజా ఐఏఎసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో వేరు సమావేశాలు నిర్వహించ కూడదని ఆదేశించారు. అలాగే ఇతర నేతలకు కూడ ఫోన్ చేసి మాట్లాడారు.
ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలతో కూడ దిగ్విజయ్ సింగ్ చర్చలు చేశారు. ఆ మరుసటి రోజే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గురు, శుక్రవారాల్లో గాంధీభవన్‌లోనే నేతలతో విడివిడిగా మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన సారాంశాన్ని నివేదిక రూపంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు అందించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదిక ఖర్గేకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల పంచాయతీపై ఏఐసీసీ చర్చించి ఒక నిర్ణయం తీసు కునే అవకాశం ఉంది.
నేతలు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించిన దిగ్విజయ్ సింగ్ ఎవ్వరు కూడ బయట నోరు విప్పకూడదని వార్నింగ్ ఇచ్చారు. పీసీసీ మార్పు ఉండదని నేతలకు పరోక్షంగా తెలియజేసిన డిగ్గిరాజా కలిసి రానున్నఎన్నికల్లో కొట్లాడాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయి కదా..? మీమేమేమి ఇక్కడకు వచ్చి ఆ పదవులు తీసుకోం కదా! మీరెందుకు ఒకరిపై ఒకరు బజారున పడి కొట్టుకుంటున్నారని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఒక్కో నాయకుడితో విడివిడిగా మాట్లాడిన ఆయన మీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నీకెన్ని ఓట్లు వచ్చాయి. గ్రాఫ్ పెరగడానికి నీవు చేసిన పనులేమిటి? ఇలా వరుసబెట్టి నాయకులు మీ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, ప్రజల్లో అభిమానం పెంపొందించుకోవడానికి చేపట్టిన కార్యక్రమాల గురించి అడిగినట్లు సమాచారం. ఇదే సమయంలో నియోజక వర్గాల వారిగా తన వద్ద ఉన్న సర్వే నివేదిక ఆధారంగా ఒక్కో నాయకుడికి డిగ్గి రాజా క్లాస్ పీకినట్లు తెలిసింది.
ముందు మీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలువడానికి ఏమి చేయాలో ఆపని చేయండి… ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకోండి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి… పని చేయకుండా ఈ చిల్లర పంచాయతీలేమిటని దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతల కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం.
ఢిల్లీ నుంచి వచ్చిన దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో దాదాపు 60 మందికి పైగా నేతలతో మాట్లాడారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులతో కూలంకుశంగా చర్చించారు. ఎక్కడా కూడ బయట మాట్లాడ కూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా ఎవరి ప్రలోభాలాకు, భయాలకు గురికాకండి… రాబోయేది మన సర్కారే అని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. ఏమాత్రం తేడా వచ్చినా మీరే బాధ్యులవుతారని హెచ్చరించారు.
సమావేశం వివరాలను ఏఐసీసీకి నివేదిక రూపంలో ఏఐసీసీకి అందజేస్తామని తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం పరిశీలిస్తుంది.. గమనిస్తుంది.. అంతా అధిష్టానం చూసుకుంటుంది.. మీ పని మీరు చేయండని నేతలకు దిగ్విజయ్ సింగ్ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. సీనియర్లు, జూనియర్లు అని ఏమిలేదు.. ఎవరు గట్టిగా పని చేస్తే వారికే అవకాశాలు వస్తాయి.. అంతే కానీ మేము సీనియర్లమంటే తగదని కూడ స్పష్టం చేసినట్లు తెలిసింది.