Manchiryala: వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది: భట్టి విక్రమార్క

20వ రోజు కొన‌సాగిన పాద‌యాత్ర‌ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే ఇస్తామని, ఇండ్లు, ఇంటి స్థలాలు, పోడు భూముల పట్టాలు, ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విధాత‌: మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గము జైపూర్ మండలం గంగిపల్లి నుండి 20వ రోజు పాదయాత్రలో భాగంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలతో మాట్లాడారు. మహిళలు పాదయాత్రలో భాగంగా […]

  • Publish Date - April 4, 2023 / 03:18 PM IST
  • 20వ రోజు కొన‌సాగిన పాద‌యాత్ర‌

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే ఇస్తామని, ఇండ్లు, ఇంటి స్థలాలు, పోడు భూముల పట్టాలు, ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

విధాత‌: మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గము జైపూర్ మండలం గంగిపల్లి నుండి 20వ రోజు పాదయాత్రలో భాగంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలతో మాట్లాడారు. మహిళలు పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్కతో సిలిండర్ ధర 1300 చేరిందని గ్యాస్ కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వివరించారు. ధరలు విపరీతంగా పెరగడంతో పూట గడవడమే ఇబ్బందిగా మారిందని తమ గోడును వెల్ల‌బోసుకున్నారు. మాకు ఆసరా పింఛన్లు కూడా రావడం లేదంటూ వెంకట లక్ష్మి, తులశమ్మ అనే ఇద్దరు మహిళలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు చెప్పారు.

పాదయాత్ర సందర్భంగా భట్టి మాట్లాడుతూ… పదో తరగతి పరీక్షలను సైతం పకడ్బందీగా నిర్వహించడంలో వైఫల్యం చెందిన ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో పరీక్ష పత్రాలు మాయం కావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని ఆరోపించారు .

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ తో ఇప్పటికే విద్యార్థులు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పదవ తరగతి పరీక్ష పత్రాల లీకేజీతో లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కెసిఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపించారు.

నాలుగు కోట్ల ప్రజలకు చెందాల్సిన తెలంగాణ సంపదను దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు
ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలో నుంచి తప్పించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే ఇండ్లు, ఇంటి స్థలాలు, పోడు భూముల పట్టాలు, ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల సాయం, ఐదువందలకే వంటగ్యాస్ సిలిండర్, రైతుబంధు మాదిరిగా కూలీలకు కూలి బంధు పథకం వస్తుందని తెలిపారు .

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర గంగినపల్లి గ్రామానికి వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఇన్‌చార్జి పీర్ల ఐలయ్య సంఘీభావం తెలిపి అక్కడి నుంచి టేకుమట్ల వరకు భట్టి పాదయాత్రలో పాల్గొని మద్దతు ప్రకటించారు.