జానా రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు

విధాత : సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా జానారెడ్డి దంపతులు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. సీఎం వెంట వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి లు ఉన్నారు. కొద్దిసేపు రేవంత్ రెడ్డి జానాతో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జానారెడ్డి కొత్త సర్కార్ కు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏమి ఉండదని సలహాలు సూచనలు కావాలంటే ఇస్తానని జానారెడ్డి మీడియాకు చెప్పారు. ప్రజాభిమానం చురగొనేలా ప్రభుత్వం పని చేయాలని సూచించానన్నారు.
అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జానారెడ్డి ఆకాంక్షించారు. తను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కెసిఆర్ నిద్రలో ఉన్నందున పరామర్శించలేకపోయానని తెలిపారు. మాజీ సీఎం గా కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించాలని ఆకాంక్షించారు.