కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు: మాణిక్ రావు ఠాక్రే

విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనో పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెంకట్‌రెడ్డితో భేటీ పిదప ఠాక్రే మీడియాతో మాట్లాడారు. హంగ్, పొత్తులపై వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు అన్నారు. వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో వీడియోలు చూసి తెలుసుకున్నాక స్పందిస్తానన్నారు. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్‌లో చెప్పిందే మా పార్టీకి ఫైనల్ అన్నారు. […]

  • Publish Date - February 14, 2023 / 01:03 PM IST

విధాత: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనో పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెంకట్‌రెడ్డితో భేటీ పిదప ఠాక్రే మీడియాతో మాట్లాడారు.

హంగ్, పొత్తులపై వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు అన్నారు. వెంకట్‌రెడ్డి ఏం మాట్లాడారో వీడియోలు చూసి తెలుసుకున్నాక స్పందిస్తానన్నారు. పొత్తులపై రాహుల్ గాంధీ వరంగల్‌లో చెప్పిందే మా పార్టీకి ఫైనల్ అన్నారు. ఎయిర్‌పోర్టులో తాను కోమటిరెడ్డిని కలవలేదని ఠాక్రే చెప్పారు.

కాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై ఠాక్రేకు టీ.కాంగ్రెస్ నేతలు పలువురు ఫిర్యాదులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఠాక్రే రెండు రోజులు తెలంగాణలోనే ఉండనుండగా, కోమటిరెడ్డి వ్యాఖ్యల వ్యవహారం మరింత ముదర నున్నట్లుగా తెలుస్తుంది.