దేశంలో కొత్త కోవిడ్ కేసులు 628
దేశంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ -19 కొత్త కేసులు 628 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,054 కు పెరిగింది

- మొత్తం కేసుల సంఖ్య 4,054
- కేరళ రాష్ట్రంలో ఒకరు మృతి
విధాత: దేశంలో గడిచిన 24 గంటల్లో కోవిడ్ -19 కొత్త కేసులు 628 నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,054 కు పెరిగింది. కేరళలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కొవిడ్ మొత్తం మరణాల సంఖ్య 5,33,334 (5.33 లక్షలు) చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డాటాలో వెల్లడించింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు)గా ఉన్నది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు)కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నది. కోవిడ్ మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.