తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

తెలంగాణ ఇంఛార్జ్‌ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్ బాధత్యలు స్వీకరించారు. ఆయ‌న‌తో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు

తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

విధాత, హైదరాబాద్‌: తెలంగాణ ఇంఛార్జ్‌ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్ బాధత్యలు స్వీకరించారు. ఆయ‌న‌తో హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ తమిళి సై రాజీనామా నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా రాష్ట్రపతి భవన్ నియమించింది. మంగ‌ళ‌వారం రాత్రి రాధాకృష్ణ‌న్ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.


తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, పుదుచ్చేరి ఇంచార్జి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కోంది. పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చేరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరింది. బాధ్య‌త‌లు స్వీక‌రించిన క్ష‌ణం నుంచి నియామ‌కం అమ‌లులోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ తన ప్రకటనలోతెలిపింది.