CPI | ఈనెల 11న కొత్తగూడెంలో ప్రజాగర్జన సభ: కూనంనేని సాంబశివరావు

CPI | అనివార్య పరిస్థితుల్లో జూన్ 4 నుంచి 11వ తేదీకి మార్పు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతావనికి తీవ్ర నష్టం నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విధాత: కొత్తగూడెంలో నిర్వహించతల పెట్టిన ప్రజాగర్జన’ బహిరంగ సభను తప్పనిసరి పరిస్థితులలో ఈ నెల 4 నుంచి 11కు మార్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. లక్షమందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు […]

CPI | ఈనెల 11న కొత్తగూడెంలో ప్రజాగర్జన సభ: కూనంనేని సాంబశివరావు

CPI |

  • అనివార్య పరిస్థితుల్లో జూన్ 4 నుంచి 11వ తేదీకి మార్పు
  • నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతావనికి తీవ్ర నష్టం
  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

విధాత: కొత్తగూడెంలో నిర్వహించతల పెట్టిన ప్రజాగర్జన’ బహిరంగ సభను తప్పనిసరి పరిస్థితులలో ఈ నెల 4 నుంచి 11కు మార్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. లక్షమందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేసుకున్నప్పటికీ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 5న సభ జరిగే ప్రదేశంలోనే సింగరేణి ‘విద్యుత్ డే’ను నిర్వహిస్తుండడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు. తాము గ్రౌండ్ ఈ నెల 4వ తేదీ రాత్రికి అప్పగిస్తామని చెప్పినప్పటికీ, సింగరేణి యాజమాన్యం అందుకు అంగీకరించకపోవడం అప్రజాస్వామికమని అన్నారు.

హైదరాబాద్ మగ్దూంభవన్ లో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, కలవేన శంకర్ లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడినా అనుమతి ఇవక పోవడం సరైంది కాదన్నారు. తాము ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించడంపై కూడా కొందరు ఎన్నికల కోసమే చేస్తున్నారంటూ కువిమర్శలు చేస్తున్నారని కూనంనేని అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతానికి అన్యాయం

ప్రస్తుత నిబంధనల ద్వారా త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని కూనంనేని అన్నారు. ఇక్కడి రాష్ట్రాలలో క్రమశిక్షణతో జనాభా నియంత్రణ, చదువులో పురోగతి, ఇతర అభ్యుదయ చర్యల కారణంగా జనాభా పెరుగుదల తక్కువ ఉండడంతో తక్కువ సీట్లు పెరుగుతాయని, ఉత్తరాదిలో ఎక్కువ జనాభా కారణంగా ఎక్కువ లోక్ సభ స్థానాలు పెరుగుతాయన్నారు. ఈ వివక్షతో దక్షిణాదిలో అసంతృప్తి పెరిగి దక్షిణ భారతదేశం డిమాండ్ వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. సహేతుకమైన రీతిలో లోక్ సభ స్థానాల పునర్విభజన జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను శుక్రవారం నాడు నిర్వహించనున్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సీపీఐ కీలక భూమిక పోషించిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తే సీపీఐ నికరంగా ఒకే వైఖరిని ప్రకటించిందని, నాటి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తనను తగులబెట్టినా కూడా తెలంగాణకు మద్దతుపై వెనక్కి తగ్గనని ఆంధ్రాలో చెప్పారని గుర్తు చేశారు.