ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలి: సీపీఎం ధర్నా

ఎలక్ట్రోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని క్లాక్ టవర్ ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు

ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలి: సీపీఎం ధర్నా

విధాత : ఎలక్ట్రోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని క్లాక్ టవర్ ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై ఎన్నికల బాండ్లను అడ్డగోలుగా తీసుకున్నదని దీని ద్వారా వేల కోట్ల రూపాయలు బిజెపి ఖాతాలో జమ చేసుకొని ఎన్నికల కోసం వాడుకుంటున్నారని వీటిని వెంటనే ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్బిఐ వెంటనే ఈ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్బిఐ చైర్మన్ బిజెపికి, నరేంద్ర మోదీకి లోపాయికారిగా సహకరిస్తున్నారని అందుకే సమయం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారని సుప్రీంకోర్టు వెంటనే వివరాలు ఇవ్వాలని ఆదేశించడం హర్షనీయమన్నారు.

లోక సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజలందరికీ ఈ ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు తెలవాలని అందులో నైతికత ప్రజలను అర్థం చేసుకుంటారని దీని ద్వారా బిజెపి నిజాయితీ ప్రజలకు బట్టబయలు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, సిహెచ్. లక్ష్మీనారాయణ, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, మన్నెం బిక్షం, కుంభం కృష్ణారెడ్డి, వెంకన్న, సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, రవీంద్ర కుమార్, బ్రహ్మానందరెడ్డి, నరేశ్, పరిపూర్ణ చారి, సైదులు తదితరులు పాల్గొన్నారు.