credit score in WhatsApp | సిబిల్‌ కష్టాలకు చెక్‌..! ఇక వాట్సాప్‌లోనే క్రిడెట్‌ స్కోర్‌..? కంప్లీట్‌ ప్రాసెస్‌ మీకోసం..!

credit score in WhatsApp | ప్రస్తుతం క్రెడిట్‌ స్కోర్‌ చాలా కీలకమైంది. రుణం కావాలన్నా.. క్రెడిట్‌ కార్డు కావాలన్నా తప్పనిసరిగా బ్యాంకులన్నీ క్రిడెట్‌ స్కోర్‌ను బట్టే జారీ చేస్తుంటాయి. అయితే, చాలా మందికి క్రెడిట్‌ స్కోరు గురించి సరైన అవగాహన ఉండదు. ఎక్కడ, ఎలా చూసుకోవాలో తెలియదు. అయితే, వాట్సాప్‌ ద్వారా సైతం క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేసుకునే అవకాశం ఉంది. అందుకోసం 9920035444 నంబర్‌ను మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. దేశంలో ప్రముఖ డేటా ఎనలిసిటిక్స్​ […]

credit score in WhatsApp | సిబిల్‌ కష్టాలకు చెక్‌..! ఇక వాట్సాప్‌లోనే క్రిడెట్‌ స్కోర్‌..? కంప్లీట్‌ ప్రాసెస్‌ మీకోసం..!

credit score in WhatsApp | ప్రస్తుతం క్రెడిట్‌ స్కోర్‌ చాలా కీలకమైంది. రుణం కావాలన్నా.. క్రెడిట్‌ కార్డు కావాలన్నా తప్పనిసరిగా బ్యాంకులన్నీ క్రిడెట్‌ స్కోర్‌ను బట్టే జారీ చేస్తుంటాయి. అయితే, చాలా మందికి క్రెడిట్‌ స్కోరు గురించి సరైన అవగాహన ఉండదు. ఎక్కడ, ఎలా చూసుకోవాలో తెలియదు. అయితే, వాట్సాప్‌ ద్వారా సైతం క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేసుకునే అవకాశం ఉంది. అందుకోసం 9920035444 నంబర్‌ను మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. దేశంలో ప్రముఖ డేటా ఎనలిసిటిక్స్​ సంస్థగా గుర్తింపు పొందిన ఎక్స్​పీరియన్​ ఇండియా తొలిసారిగా ఈ సేవలు భారతీయులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు సులభంగా, వేగంగా క్రెడిట్​ రిపోర్టును చెక్​ చేసుకోవడమే లక్ష్యంగా ఈ సేవలను ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది.

ఎలా సిబిల్‌ చెక్‌ చేసుకోవాలంటే..?

  • 9920035444 నంబర్‌ను సేవ్‌ చేసుకున్న తర్వాత వాట్సాప్‌ నుంచి ‘హాయ్‌’ అంటూ మెస్సేజ్‌ పంపాలి.
  • ఆ తర్వాత వ్యూ క్రెడిట్​ రిపోర్ట్​ అనే ఆప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్​ చేయాలి.
  • అనంతరం పాన్​కార్డులో పేరు ఎలా ఉందో.. అలాగే పంపమని సందేశం వస్తుంది. అప్పుడు మీ పేరు టైప్‌ చేయాలి.
  • అఫీషియల్​ మెయిల్​ ఐడీ కన్ఫర్మ్​ చేయమని అడుగుతుంది. ఆ సమయంలో మెయిల్​ ఐడీని సెండ్​ చేయాలి.
  • మళ్లీ మీ క్రెడిట్ రిపోర్ట్​కు కనెక్ట్​ అయిన​ మొబైల్​ నెంబర్​ ఇదేనా? కాదా? అని మెస్సేజ్‌ వస్తే.. అప్పుడు YES అని టైప్​ చేయాలి.
  • ఆ తర్వాత సెండ్​ ఓటీపీ అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
  • వచ్చిన ఓటీపీని వాట్సాప్‌లో ఎంటర్‌ చేయగానే మీ క్రెడిట్‌ రిపోర్ట్ వచ్చేస్తుంది.
  • https://wa.me/message/LBKHANJQNOUKF1 లింక్‌పై పై క్లిక్​ చేసి.. అడిగిన వివరాలు ఇచ్చినా క్రికెట్‌ స్కోరు వాట్సాప్‌ తెరపై చూపిస్తుంది.