బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్‌పై వెళ్లువెత్తుతున్న విమర్శలు
నిరాశ్రయుల గోడు పట్టని రిషిసునాక్ విధాత: కొందరికి ఎదుట ఉన్నది ఏమీ పట్టదు. కండ్లకు కనిపిస్తున్న వాస్తవం కనిపించదు. అలాంటి వారిది ఒకటే యావ.. ఒకటే భాష. అదే వ్యాపార భాష. మానవ స్పర్శ అంటదు, మానవీయత తెలియదు. సరిగ్గా ఇలాంటి తరహా వ్యక్తినే తానని బ్రిటిష్ ప్రధాని రిషిసునాక్ ఇటీవల నిరూపించుకున్నాడు. క్రిష్టమస్‌కు ముందు రోజు రిషిసునాక్ లండన్‌లోని ఓ నిరాశ్రయుల ఆశ్రమాన్ని సందర్శించాడు. అందులోని నిరాశ్రయులను పలకరిస్తూ వంటగదిలోకి వెళ్లాడు. స్వయంగా అక్కడ ఉన్న […]

- నిరాశ్రయుల గోడు పట్టని రిషిసునాక్
విధాత: కొందరికి ఎదుట ఉన్నది ఏమీ పట్టదు. కండ్లకు కనిపిస్తున్న వాస్తవం కనిపించదు. అలాంటి వారిది ఒకటే యావ.. ఒకటే భాష. అదే వ్యాపార భాష. మానవ స్పర్శ అంటదు, మానవీయత తెలియదు. సరిగ్గా ఇలాంటి తరహా వ్యక్తినే తానని బ్రిటిష్ ప్రధాని రిషిసునాక్ ఇటీవల నిరూపించుకున్నాడు.
క్రిష్టమస్‌కు ముందు రోజు రిషిసునాక్ లండన్‌లోని ఓ నిరాశ్రయుల ఆశ్రమాన్ని సందర్శించాడు. అందులోని నిరాశ్రయులను పలకరిస్తూ వంటగదిలోకి వెళ్లాడు. స్వయంగా అక్కడ ఉన్న సూప్‌ను వడ్డించాడు.
ఆ క్రమంలో అక్కడ ఉన్న నిరాశ్రయున్ని పలకరిస్తూ ‘ఇంకేమైనా కావాలా..’ అని ప్రశ్నించాడు. దానికి బదులుగా.. నిరాశ్రయుడు- ‘మీరు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా..?’ అని అడిగాడు. నిరాశ్రయుడి మాటను పట్టించుకోకుండా.. ‘నీవు ఏదైనా వ్యాపారంలో ఉన్నావా?’ అని రిషిసునాక్ ప్రశ్నించాడు.
దీనికి సమాధానంగా.. ‘లేదు. నేను నిరాశ్రయుడిని. కానీ నాకు వ్యాపారంపై ఆసక్తి ఉన్నదని సమాధానం ఇస్తూ.. నేను ఏ ఆశ్రయం లేకుండా రోడ్డుమీద ఉన్నాను. ఈ క్రిస్మస్‌కు నిరాశ్రయుల ఆశ్రమంలో ఉన్నాను. మీరు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడితే, తద్వారా నాకు మీరు తగు రీతిన సాయమందిస్తే వచ్చే క్రిస్మస్ నాటికైనా నాదైన ఇంట్లో ఉంటానని’ అన్నాడు.
ఇలా.. నిరాశ్రయుడు తన గూడులేని గోడును చెప్పుకొంటుంటే.. దాన్నేమీ పట్టించుకోకుండా.. రిషి సునాక్ మాత్రం.. ఆర్థిక రంగంలో కెరీర్ ఎలా అద్భుతంగా ఉంటుందో చెప్పసాగాడు! ఇదంతా విన్న వారు తమ ప్రధాని ఏం మాట్లాడుతున్నారో అర్థం గాక నోరు వెళ్లబెట్టారట.
నిరాశ్రయుల ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ మాట్లాడిన తీరు ఇప్పుడు ఇంగ్లండ్‌లోనే కాదు సోషల్ మీడియా వేదికగా ప్రపంచమంతా వైరలై అందరినీ నోరెళ్లబెట్టేట్టు చేస్తున్నది. ఎంతైనా వ్యాపారం లోంచే ఎదిగి వచ్చిన వాడు గదా రిషి సునాక్.. వ్యాపార భాష తప్ప మరేదీ పట్టటం లేదని బ్రిటిష్ లేబర్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నది.