CUET PG 2023 నోటిఫికేషన్ విడుదల
విధాత: 30 రోజుల ఉచిత రెసిడెన్సియల్ కోచింగ్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉచిత కోచింగ్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ &ఎంఏ ఇంగ్లీష్ సబ్జెక్టులను ఆఫర్ చేస్తున్నది. రెండు సబ్జెక్టుల్లో 40 సీట్లకు మహిళల-పురుషులకు సమాన సంఖ్యలో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. 11-03-2023 నుంచి 12-04-2023 వరకు 30 రోజుల పాటు ఈ కోచింగ్ ఇవ్వనున్నది. ఈ ఉచిత కోచింగ్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న […]

విధాత: 30 రోజుల ఉచిత రెసిడెన్సియల్ కోచింగ్ కోసం సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉచిత కోచింగ్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ &ఎంఏ ఇంగ్లీష్ సబ్జెక్టులను ఆఫర్ చేస్తున్నది.
రెండు సబ్జెక్టుల్లో 40 సీట్లకు మహిళల-పురుషులకు సమాన సంఖ్యలో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. 11-03-2023 నుంచి 12-04-2023 వరకు 30 రోజుల పాటు ఈ కోచింగ్ ఇవ్వనున్నది.
ఈ ఉచిత కోచింగ్ దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులు దేశంలోని ఏదేని రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత నివాసి అయి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న లేదా చివరి సెమిస్టర్ చదివే వాళ్లు లేదా ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసినవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది.
ఈ సీట్ల భర్తీలో కులం, లింగభేదం, మతం లాంటివి పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది. అలాగే ఢిగ్రీలో సామాజిక శాస్త్రాలు సబ్జెక్టుగా చదవని వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 03-03-2023గా నిర్ణయించింది.
మరిన్ని వివరాల కోసం డాక్టర్ సుదర్శన్ బాలబోయిన (ఫాకల్టీ & డైరెక్టర్ PACPET) 6309316222, లేదా పల్లికొండ మణికంట (ఫాకల్టీ & అకడమిక్ కోఆర్డినేటర్ PACPET) సంప్రదించాలని ప్రకటనలో తెలిపింది.