HOROSCOPE | దిన ఫలాలు తేదీ: 23.05.2023; చంద్రచారము: మిథునరాశి. Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మేషరాశి: చంద్రుడు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకుంటాయి. గృహ, కుటుంబ విషయాల్లోనూ అంతా సవ్యంగా […]
HOROSCOPE | దిన ఫలాలు
తేదీ: 23.05.2023; చంద్రచారము: మిథునరాశి.
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషరాశి: చంద్రుడు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకుంటాయి. గృహ, కుటుంబ విషయాల్లోనూ అంతా సవ్యంగా ఉంటుంది.
వృషభరాశి: చంద్రుడు 2వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొంత మానసిక వేదన, దిగులు ఉంటాయి. స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.
మిథునరాశి: చంద్రుడు 1వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ రంగాల్లో అనుకూలమైన కార్యములు చోటు చేసుకుంటాయి.
కర్కాటక రాశి: చంద్రుడు 12వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది. వాటి ప్రభావం కుటుంబ, ఆస్థి విషయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది.
సింహరాశి: చంద్రుడు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయక కార్యములు సంభవిస్తాయి.
కన్యారాశి: చంద్రుడు 10వ ఉంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబంతో పాటు ఆరోగ్య విషయాల్లోనూ చెప్పుకోతగిన మార్పులు తెస్తుంది.
తులారాశి: చంద్రుడు 9వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా మానసిక వేదన, విచారం కలిగే అవకాశం ఉన్నది.
వృశ్చికరాశి: చంద్రుడు 8వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, ఇబ్బందుల కారణంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. టెన్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నది.
ధనూరాశి: చంద్రుడు 7వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆరోగ్యం, ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో విజయాలను ఆశించవచ్చు.
మకరరాశి: చంద్రుడు 6వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆరోగ్యం, వృత్తి, వ్యాపార రంగాల్లో చెప్పుకోతగిన మార్పులు కనిపిస్తాయి.
కుంభరాశి: చంద్రుడు 5వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని నష్టాలు, వృత్తిపరమైన ఇబ్బందులతో మానసిక వేదన కలిగే అవకాశం ఉన్నది.
మీనరాశి: చంద్రుడు 4వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని స్వల్ప నష్టాలు, వివాదాల కారణంగా వివాదాలు, శత్రుత్వం చోటు చేసుకునే అవకాశం ఉన్నది.