ఎవ‌రు ముందు చ‌నిపోతారో అని పందెం.. రైలుకు ఎదురెళ్లిన మిత్రులు.. ఆపై ఏం జరిగిందంటే!!

దూసుకొస్తున్న రైలు.. ప‌ట్టాల‌పై మిత్రుడు.. విధాత: పూట్‌గా తాగిన త‌ర్వాత ఆముదాలు బుక్కాడ‌న్నసామెత ఉన్న‌ది. హ‌రియాణ రాష్ట్రం సోనిప‌త్ జిల్లా జ‌ట్వాడా గ్రామానికి చెందిన ఇద్ద‌రు రాత్రంతా పీక‌ల‌ దాకా తాగారు. మిత్రులైన మ‌నూ, ముఖేశ్ తాగిన మైకంలో ఎవ‌రు ముందు చ‌నిపోతారో న‌ని పందెం కాశారు. రైల్వే ట్రాక్ ద‌గ్గ‌రికి చేరుకున్నారు. చావు పై పందెం వేసుకొన్న వీరు వ‌స్తున్న రైలుకు ఎదురెళ్లి చావును చూడాల‌నుకున్నారు. అప్పుడే ట్రాక్‌పై దూసుకొస్తున్న రైలును చూసి ముఖేశ్‌ను మ‌ను […]

  • By: krs    latest    Dec 02, 2022 1:12 PM IST
ఎవ‌రు ముందు చ‌నిపోతారో అని పందెం.. రైలుకు ఎదురెళ్లిన మిత్రులు.. ఆపై ఏం జరిగిందంటే!!

దూసుకొస్తున్న రైలు.. ప‌ట్టాల‌పై మిత్రుడు..

విధాత: పూట్‌గా తాగిన త‌ర్వాత ఆముదాలు బుక్కాడ‌న్నసామెత ఉన్న‌ది. హ‌రియాణ రాష్ట్రం సోనిప‌త్ జిల్లా జ‌ట్వాడా గ్రామానికి చెందిన ఇద్ద‌రు రాత్రంతా పీక‌ల‌ దాకా తాగారు. మిత్రులైన మ‌నూ, ముఖేశ్ తాగిన మైకంలో ఎవ‌రు ముందు చ‌నిపోతారో న‌ని పందెం కాశారు. రైల్వే ట్రాక్ ద‌గ్గ‌రికి చేరుకున్నారు.

చావు పై పందెం వేసుకొన్న వీరు వ‌స్తున్న రైలుకు ఎదురెళ్లి చావును చూడాల‌నుకున్నారు. అప్పుడే ట్రాక్‌పై దూసుకొస్తున్న రైలును చూసి ముఖేశ్‌ను మ‌ను ప‌ట్టాల‌పైకి తోసేశాడు. దీంతో ముఖేశ్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. దీన్నంతా ప్ర‌త్య‌క్షంగా చూసిన వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొన్న పోలీసులు మ‌నూని అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టారు. తాగుబోతులైన పందెం రాయుళ్ల మూర్ఖ‌త్వంతో ఇరు కుటుంబాలూ రోడ్డున ప‌డే దుస్థితి వ‌చ్చింద‌ని ఇరుగుపొరుగు సానుభూతి వ్య‌క్తం చేశారు.

Breaking: ఎమ్మెల్సీ కవితకు CBI నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్సీ