యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో అలంకార, వాహన సేవలు

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం స్వామివారికి మత్స అవతార అలంకార సేవ, శేషవహన సేవలు నిర్వహించారు. స్వామి సన్నిధిలో నిత్యారాధనల అనంతరం ఉదయం ఋత్వికుల వేద పఠనం, పారాయణల పిదప 9 గంటలకు స్వామివారిని వేద రక్షకుడైన మత్సావతార అలంకార సేవలో మాడ వీధుల్లో ఊరేగించారు. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగిన సందర్భంలో శ్రీమహావిష్ణువు లోకరక్షణార్థం మత్సవ తార రూపం దాల్చి […]

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో అలంకార, వాహన సేవలు

విధాత: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం స్వామివారికి మత్స అవతార అలంకార సేవ, శేషవహన సేవలు నిర్వహించారు. స్వామి సన్నిధిలో నిత్యారాధనల అనంతరం ఉదయం ఋత్వికుల వేద పఠనం, పారాయణల పిదప 9 గంటలకు స్వామివారిని వేద రక్షకుడైన మత్సావతార అలంకార సేవలో మాడ వీధుల్లో ఊరేగించారు.

పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగిన సందర్భంలో శ్రీమహావిష్ణువు లోకరక్షణార్థం మత్సవ తార రూపం దాల్చి సోమకాసురుడిని సంహరించి వేదాలను సంరక్షిస్తారు. వేద స్వరూపుడైన యాదగిరిషుడు మత్స అవతార అలంకార సేవలో వేద రక్షకుడిగా భక్తులను అనుగ్రహించారు.

సాయంత్రం శేషవహనాన్ని అధిరోహించి స్వామి వారు తిరువీధుల్లో ఊరేగారు. స్వామివారు శ్రీదేవి భూదేవి సహితుడై ఆదిశేషునిపై విహరిస్తూ తీర్ధ జనానికి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.