సింగరేణిపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

రాష్ట్ర సచివాలయంలో సింగరేణి సంస్థ కార్యకలాపాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సమీక్ష చేపట్టారు

సింగరేణిపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

విధాత : రాష్ట్ర సచివాలయంలో సింగరేణి సంస్థ కార్యకలాపాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం సమీక్ష చేపట్టారు. సమీక్షా సమావేశానికి సీఎండి శ్రీధర్‌, డైరక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సింగరేణి లాభ నష్టాలు, ప్రస్తుత గనుల స్థితిగతులు, కొత్త గనుల ప్రయత్నాలు..కార్మికుల సమస్యలపై ఈ సమీక్ష సందర్భంగా చర్చించనున్నారు. ఇటీవల సింగరేణి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం కార్మికులకు పలు హామీల ఇచ్చిన నేపధ్యంలో వాటి అమలుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని భావిస్తున్నారు.