బాధ్యతలు స్వీకరించిన భట్టి.. పలు శాఖలకు నిధుల జాతర

ఆరు గ్యారంటీల అమలు పురోగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సబంధించి 374కోట్లు విడుదల చేసింది.

బాధ్యతలు స్వీకరించిన భట్టి.. పలు శాఖలకు నిధుల జాతర

సబ్సిడీలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి


విధాత : ఆరు గ్యారంటీల అమలు పురోగతిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సబంధించి 374కోట్లు విడుదల చేసింది. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి రూ.996 కోట్లు విడుద చేయగా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేసింది.


ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయా శాఖలకు సబ్సిడీలను విడుదల చేసి, సమ్మక్క, సారక్క జాతరకు నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి..నిధుల సమీకరణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమన్వయం చేసుకుంటు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధుల మంజూరీ కొనసాగిస్తుంది.