నా లెక్క పాలు అమ్మినవా.. నీకు డబ్బులెక్కడివి రాజగోపాల్?: మల్లారెడ్డి
రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు కాంట్రాక్టులు ఉండేవా? ఏమీ లేకుండే. కాటన్ బట్ట, కుర్తా పైజామ్ వేసుకుంటుండే అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇవాళ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. పెద్ద బిల్డింగులలో ఉంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం చేశావా? లేకుంటే నా వలె పాలు అమ్మినవా? లేకపోతే నా లెక్క స్కూళ్లు పెట్టినవా? అని ప్రశ్నించారు. ఇవన్నీ కాంట్రాక్టులే కదా అన్నారు. వైఎస్ ప్రభుత్వంలో లూటీ […]

రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఆయనకు కాంట్రాక్టులు ఉండేవా? ఏమీ లేకుండే. కాటన్ బట్ట, కుర్తా పైజామ్ వేసుకుంటుండే అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇవాళ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. పెద్ద బిల్డింగులలో ఉంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం చేశావా? లేకుంటే నా వలె పాలు అమ్మినవా? లేకపోతే నా లెక్క స్కూళ్లు పెట్టినవా? అని ప్రశ్నించారు.
ఇవన్నీ కాంట్రాక్టులే కదా అన్నారు. వైఎస్ ప్రభుత్వంలో లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలోకి వెళ్లి మళ్లీ లూటీ చేయాలని చూస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేయడానికి, సేవ చేయడానికి వాళ్లు రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఎందుకలో కాంట్రాక్టు ఇస్తే, ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి వెళ్లాలి. దోపిడీ చేయాలి.. ప్రజలకు టోపి పెట్టాలని విమర్శించారు.