క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది

క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

రాడిసన్ కేసులో ఇరికిస్తున్నారని వాదన

విధాత, హైదరాబాద్ : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసులు క్రిష్‌ను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విచారణకు రావాలని ఇప్పటికే పోలీసులు క్రిష్‌కు నోటీసులివ్వగా, ఆయన తాను సోమవారం హాజరవుతానని చెప్పి, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటీషన్‌లో పేర్కొన్నారు. వివేకానంద స్టేట్మెంట్ ఆధారంగా తనను నిందితుడిగా చేర్చారని, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనన్నారు. ఈ కేసులో తననరు పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను శుక్రవారం విచారించిన హైకోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని గచ్చిబౌలీ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.