జంప్ జిలానీలు.. రాజకీయంగా కనుమరుగు
ఎన్నికల సమయంలో జంప్ జిలానీలకు చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి వారికి రాజకీయంగా అయా పార్టీల నుంచి హామీలు వస్తుంటాయి. అందుకే చాలామంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమో.. ఇతర అవకాశాల కోసమో ఒక పార్టీ జెండా దించి మరో జెండా ఎత్తుకోవడం ఎన్నికల సమయంలో సహజం. అయితే ఈ మధ్య రేవంత్ రెడ్డి అన్నట్లు మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్లి టీఆరెఎస్తో ఎట్లా కొట్లాడుతారు అన్న ప్రశ్న ప్రజల్లో నుంచి కూడా ఉత్పన్నం అవుతుంది. […]

ఎన్నికల సమయంలో జంప్ జిలానీలకు చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి వారికి రాజకీయంగా అయా పార్టీల నుంచి హామీలు వస్తుంటాయి. అందుకే చాలామంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమో.. ఇతర అవకాశాల కోసమో ఒక పార్టీ జెండా దించి మరో జెండా ఎత్తుకోవడం ఎన్నికల సమయంలో సహజం.
అయితే ఈ మధ్య రేవంత్ రెడ్డి అన్నట్లు మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్లి టీఆరెఎస్తో ఎట్లా కొట్లాడుతారు అన్న ప్రశ్న ప్రజల్లో నుంచి కూడా ఉత్పన్నం అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏదైనా నియోజక వర్గంలో ఉప ఎన్నిక వస్తున్నది అంటే అక్కడి ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలి? ఎవరికి షాక్ ఇవ్వాలి? ఎవరికి గుణ పాఠం చెప్పాలన్నది ముందే డిసైడ్ అవుతారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చి, ప్రచారం జరుగుతున్న సమయంలో అన్ని పార్టీల సభలకు, రోడ్ షోలకు భారీగానే జనాలు వస్తారు. అయితే వాటికి జన సమీకరణ ఎలా చేస్తారో మన అందరికీ తెలిసిందే. అందుకే ఒకరి సమస్యను మరొకరు నెత్తిన పెట్టుకుంటే రాజకీయంగా చాలా నష్ట పోవాల్సి వస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎనిమిది ఏళ్లకు పైగా పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఈ సమయంలో ఉప ఎన్నికల సమయంలో ఎవరినో ఎన్నికల్లో రక్షించబోయి రాజకీయంగా కనుమరుగు అయిన నేతలు కోకొల్లలు అంటున్నరు. జంప్ జిలానీలకు ఇది వర్తిస్తుంది.