విధాత: రాష్ట్రంలో ఫిబ్రవరి చివరికల్లా రాష్ట్ర శాసనసభ రద్దయి రాష్ట్రపతి పాలన రానున్నట్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడలో హాత్ సే హాత్ జోడో అభియాన్ సన్నాహక సమావేశం లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో తాము ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నెలకొందని, రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారుమ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 60 రోజుల పాటు ఇంటింటి ప్రచారంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే కాంగ్రేస్ కార్యకర్తలపై పోలీసు శాఖ రోజు వారీ వేధింపులకు వ్యతిరేకంగా కోదాడలో భారీ ‘జైల్ భరో’ ఆందోళనను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కోదాడలో ల్యాండ్, ఇసుక, వైన్స్, మైన్స్ మాఫియాకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలవడం దురదృష్టకరమన్నారు.
కోదాడలో కాంగ్రెస్ 50 వేల మెజారిటీతో గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ సమావేశంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ లు పాల్గొన్నారు.