Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. జార్జియా రాకేటీరింగ్ కేసులో జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర ఆరోపణలు మాజీ అధ్యక్షుడిపై ఉన్నాయి. అయితే, డొనాల్డ్ ట్రంప్ ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి 2 లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను […]
Donald Trump |
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. జార్జియా రాకేటీరింగ్ కేసులో జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర ఆరోపణలు మాజీ అధ్యక్షుడిపై ఉన్నాయి.
అయితే, డొనాల్డ్ ట్రంప్ ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి 2 లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్ తీసుకునేందుకు.. అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫాని విల్లీస్ అనుమతించారు. ఈ క్రమంలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు.
ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. కౌంటీ జైలు వద్ద పోలీసుల వద్ద ట్రంప్ లొంగిపోగా.. పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ట్రంప్ జైలులో ఉన్నారు. అనంతరం రెండు లక్షల డాలర్ల పూచీకత్తుపై విడుదలయ్యారు. ట్రంప్ అంట్లాంటాలో గురువారం రాత్రి 7 గంటలకు వెళ్లారు. ఆ తర్వాత ట్రంప్ అరెస్ట్‌ను అరెస్టు చేసి విడుదల చేశారు.
అయితే, సంబంధించిన ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. 77 ఏండ్ల ట్రంప్ 6 అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జట్టు ట్రంప్‌కు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ట్రంప్ జైలుకు వచ్చిన సందర్భంలో జైలు అధికారులు ఆయనతో కలిసి ఫొటోలు దిగడం విశేషం. ఇదిలా ఉండగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఈ ఏడాది నుంచి కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఆయనపై అగ్రరాజ్యంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఆయన దోషిగా కూడా తేలారు. అయితే, ఓ వైపు కేసులతో జైళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ట్రంప్ తనను తాను సమర్థించుంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం కక్ష్య సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. దేశ చరిత్రలో తన అరెస్ట్ ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు.
ఇదిలా ఉండగా.. మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో నిలవాలని భావిస్తున్న ట్రంప్ వరుస కేసుల్లో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయా కేసులు ఎన్నికలపై ప్రభావం చూపి అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ మాత్రం తనంటే ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, తనకు అమెరికా ప్రజలు తొలి ప్రాధాన్యం అని ట్రంప్ పేర్కొంటున్నారు.