Donald Trump | అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట వివాహ వేడుక జరిగింది. ట్రంప్ రెండో కూతురు టిఫానీ ట్రంప్(29) ప్రేమ వివాహం చేసుకుంది. అమెరికన్ బిలినీయర్ మిచ్చెల్ బోలౌస్‌ను టిఫానీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ట్రంప్‌నకు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4:30 గంటలకు టిఫానీ వివాహం జరిగింది.
కాగా వధువు టిఫానీని ట్రంప్ తన చేతులతో పట్టుకొని వివాహ వేడుక వద్దకు తీసుకెళ్లారు. అనంతరం నూతన వధువుకు ట్రంప్ ముద్దు పెట్టి, వరుడికి అప్పగించారు. సోదరి టిఫానీ వివాహ వేడుక ఫోటోలను ఇవాంకా ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. టిఫానీ, మిచ్చెల్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాంక ట్వీట్ చేశారు. వారు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. వారి ప్రేమ ఈ ప్రపంచానికి వెలుగు ఇవ్వాలని కోరుకున్నారు ఇవాంక.
Wishing @TiffanyATrump and Michael an abundance of happiness and joy as they begin their lives together as husband and wife!
May their love be a source of light in this world!