సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వద్దు.. వారైతే ఓకే.. యువతి యాడ్ వైరల్
విధాత: ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అంటే నేరుగా ఇంటికి వెళ్లి చూసుకునే వారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉంది. ఈ డిజిటలైజేషన్ ప్రపంచంలో అన్ని ఆన్‌లైన్‌లోనే చకచకా జరిగిపోతున్నాయి. అంతెందుకు ఆన్‌లైన్‌లోనే వివాహాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. అయితే యువతి తనకు కావాల్సిన వరుడు ఇలా ఉండాలని ఇచ్చిన మ్యాట్రిమోనియల్ యాడ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ యాడ్ పాతదే అయినప్పటికీ మరో సారి ట్రెండ్ అవుతోంది. ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందంగా […]

విధాత: ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అంటే నేరుగా ఇంటికి వెళ్లి చూసుకునే వారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉంది. ఈ డిజిటలైజేషన్ ప్రపంచంలో అన్ని ఆన్‌లైన్‌లోనే చకచకా జరిగిపోతున్నాయి. అంతెందుకు ఆన్‌లైన్‌లోనే వివాహాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం.
అయితే యువతి తనకు కావాల్సిన వరుడు ఇలా ఉండాలని ఇచ్చిన మ్యాట్రిమోనియల్ యాడ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ యాడ్ పాతదే అయినప్పటికీ మరో సారి ట్రెండ్ అవుతోంది.
ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందంగా ఉంటాను. తనకు కాబోయే వరుడు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయి ఉండాలి. లేదా డాక్టర్‌గా(పీజీ) పని చేస్తూ ఉండాలి. పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త అయినా అయి ఉండాలి అని యాడ్‌లో పేర్కొన్నారు.
ఇక దయచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మాత్రం కాల్ చేయొద్దని కోరారు. ఈ యాడ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. ఐటీ భవిష్యత్ అంతగా కనిపించడం లేదని చమత్కరించారు.