SBI clarification
విధాత: రూ.2 వేల నోట్ల మార్పిడిపై వినియోగదారులకు నెలకొన్న సందేహాలపై ఎస్‌బీఐ స్పష్టత ఇచ్చింది. నోట్ల మార్పిడికి ఎలాంటి గుర్తింపు పత్రం నింపాల్సిన అవసరం లేదని తెలిపింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ. 20 వేల వరకు బ్యాంకులో నేరుగా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొన్నది.
మార్కెట్లో చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. రూ.2 వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోగా బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని సూచించింది.