Navdeep | డ్రగ్స్ కేసు.. నటుడు నవదీప్‌కు హైకోర్టులో ఊరట
Navdeep | డ్రగ్స్‌కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నవదీప్ ఈనెల 19 వరకు అదుపులోకి తీసుకోకండి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం విధాత, హైదరాబాద్ : హిరో నవదీప్‌కు డ్రగ్స్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఊరట కలిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ-1 కే. భాస్కర్ బాలాజీ, ఏ-2 కే. వెంకట రత్నారెడ్డి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ […]

Navdeep |
- డ్రగ్స్‌కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నవదీప్
- ఈనెల 19 వరకు అదుపులోకి తీసుకోకండి
- పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
- ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం
విధాత, హైదరాబాద్ : హిరో నవదీప్‌కు డ్రగ్స్ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు ఊరట కలిగించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ-1 కే. భాస్కర్ బాలాజీ, ఏ-2 కే. వెంకట రత్నారెడ్డి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అనంతరం ఏ-1, ఏ-2 ఇచ్చిన సమాచారం మేరకు ఏ-8 ఉన్న హిరో నవదీప్ మిత్రుడు కే. రాంచందర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాతేనే హిరో నవదీప్ కు ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలిందని శుక్రవారం సీపీ ఆనంద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా హిరో నవదీప్ తో పాటు నిర్మాత సుశాంత్ కు కూడా ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు..
హిరో నవదీప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని కావాలని నన్ను ఇందులో ఇరికేంచే ప్రయత్నం చేస్తున్నారని హిరో నవదీప్ బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు నేను పరారీలో ఉన్నట్లు చూపిస్తున్నారని, నేను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్‌లోనే ఉన్నానని, అయినా కొన్ని టీవీ ఛానెల్‌లు నేను హైదరాబాద్‌లో లేను అని చూపిస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు.
నాపై వచ్చిన ఈ ఆరోపణలో ఎలాంటి సరైన ఆధారాలు లేకుండానే కావాలని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సూచించారు. తన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రికావరీ జరుగలేదని దయచేసి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని వేడుకుంటున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ కె. సురేందర్ విచారణ చేపట్టారు.
ఈ బెయిల్ పిటిషన్ ను 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం సూచించింది. అప్పటి వరకు నవదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకుండా నవదీప్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పోలీసులు మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.