Chhattisgarh| విధాత: ఓ డాక్టర్ తన బాధ్యతను మరిచాడు. పీకల దాకా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు. ఆపై ఓ మహిళా రోగిపై దాడి చేశాడు. ప్రశ్నించిన యువకుడిని నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించాడు డాక్టర్. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోబ్రా జిల్లాలోని జెర్వానీ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుమారుడు శ్యాం కుమార్ అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. రావడానికి కొంత సమయం పడుతోందని అంబులెన్స్ డ్రైవర్ చెప్పగా, అతనే ఆటో రిక్షాలో తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
అయితే రాత్రి అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహిళా రోగి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెకు వైద్యం చేస్తూనే చెంపపై రెండు, మూడు సార్లు ఛెల్లుమనిపించాడు. తన తల్లిని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించగా, అతన్ని కూడా బెదిరించాడు డాక్టర్. ఆ సమయంలో డాక్టర్ మద్యం సేవించినట్లు తేలింది.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#Chhattisgarh | कथित तौर पर नशे की हालत में एक डॉक्टर ने मरीज को पीटा, पिटाई का वीडियो हुआ सोशल मीडिया पर वायरल@CG_Police #Doctor #ChhattisgarhPolice #Patient #Hospital #Korba #Treatment #abcnewsmedia #छत्तीसगढ़ pic.twitter.com/lRcr7ZNAFd
— Abcnews.media (@abcnewsmedia) November 10, 2022