రేవంతన్నా.. న్యాయం చేయన్నా!

హైకోర్టు ఇచ్చిన తీర్పు మేర‌కు త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాల‌ని డీఎస్సీ 2008 బాధిత అభ్య‌ర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.

రేవంతన్నా.. న్యాయం చేయన్నా!
  • డీఎస్సీ 2008 బాధితుల విజ్ఞప్తి
  • ప్రజాభవన్ కు తరలివచ్చిన 500 మంది బాధితులు
  • స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదలబోమని బైఠాయింపు
  • వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఈనెల 8న సూచించిన హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతున్న బాధితులు



హైకోర్టు ఇచ్చిన తీర్పు మేర‌కు త‌మ‌కు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాల‌ని డీఎస్సీ 2008 బాధిత అభ్య‌ర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.మంగళవారం దాదాపు 500 మందికి పైగా అభ్యర్థులు ప్రజా భవన్ కు చేరుకున్నారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు.

ఈ మేరకు తమకు నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోపే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం… తమ 15 ఏళ్ల కన్నీళ్లు తుడవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.