మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. జిల్లాల వారీగా పోస్టుల వివ‌రాలు..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 11,062 పోస్టుల‌తో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

  • By: Somu    latest    Feb 29, 2024 11:34 AM IST
మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. జిల్లాల వారీగా పోస్టుల వివ‌రాలు..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 11,062 పోస్టుల‌తో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న నివాసంలో విద్యాశాఖ అధికారుల‌తో క‌లిసి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు.వ వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి.


జిల్లాల వారీగా పోస్టుల‌ను ప‌రిశీలిస్తే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్య‌ధికంగా ఖ‌మ్మం జిల్లాలో 176 ఉన్నాయి. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో 158, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం 129, న‌ల్ల‌గొండ‌లో 128, నిజామాబాద్‌లో 124, కామారెడ్డిలో 121, వికారాబాద్ జిల్లాలో 102 పోస్టులు ఉన్నాయి. అత్య‌ల్పంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 26 పోస్టులు, ములుగులో 33, జోగులాంబ గద్వాలో 35, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 38 పోస్టులు ఉన్నాయి.


ఎస్జీటీ పోస్టులు అత్య‌ధికంగా హైద‌రాబాద్ జిల్లాలో


ఇక ఎస్‌జీటీ పోస్టుల విషయానికి వ‌స్తే అత్య‌ధికంగా హైద‌రాబాద్ జిల్లాలో 537 పోస్టులు ఉండ‌గా, అత్య‌ల్పంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 51 పోస్టులు ఉన్నాయి. నిజామాబాద్‌లో 403, సంగారెడ్డిలో 385, న‌ల్ల‌గొండ‌లో 383, ఖ‌మ్మంలో 334, కామారెడ్డిలో 318 పోస్టులు ఉన్నాయి. అత్య‌ల్పంగా పెద్ద‌ప‌ల్లి జిల్లాలో 21 ఉన్నాయి. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 51, వ‌న‌ప‌ర్తిలో 56, సిరిసిల్ల‌లో 67 పోస్టులు ఉన్నాయి.