APలో ముందస్తు ఎన్నికలు? వ్యతిరేకత పెరగకముందే ఆర్పేయాలి.. జగన్ ప్లాన్!

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి ఎన్ని వేల కోట్లు పంచినా జగన్ పట్ల ప్రజల్లో విపరీతమైన అనురక్తి ఏర్పడలేదు. ప్రజల్లో జగన్ పాలన పట్ల పెదవి విరుపు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పులు చేసి పంచడం తప్ప శాశ్వత అభివృద్ధి ఎక్కడా లేదని విద్యావంతులు మధ్యతరగతి వాళ్ళు అంటున్నారు. ఈ వ్యతిరేకత మరింత పెరిగి తుపానుగా మారకముందే ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలవాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిడిపి, జనసేన పొత్తులు ఇంకా ఖరారు […]

  • Publish Date - March 31, 2023 / 06:22 PM IST

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి ఎన్ని వేల కోట్లు పంచినా జగన్ పట్ల ప్రజల్లో విపరీతమైన అనురక్తి ఏర్పడలేదు. ప్రజల్లో జగన్ పాలన పట్ల పెదవి విరుపు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పులు చేసి పంచడం తప్ప శాశ్వత అభివృద్ధి ఎక్కడా లేదని విద్యావంతులు మధ్యతరగతి వాళ్ళు అంటున్నారు.

ఈ వ్యతిరేకత మరింత పెరిగి తుపానుగా మారకముందే ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలవాలని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిడిపి, జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాకముందే యుద్ధభేరి మోగించాలన్నది జగన్ ఆలోచన అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ అయితే ఎన్నడూ లేని విధంగా గత రెండు వారాలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్ర సమస్యలు.. నిధులు.. పోలవరం బిల్స్ కోసం అని బయటికి చెబుతున్నా లోపల జగన్ ప్లాన్స్ వేరే ఉన్నాయని అంతా అంటున్నారు.

ఆ పనులతో బాటు.. రాజకీయ పనుల మీద కూడా వెళ్తున్నారని అంటున్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎవరేంటో జనాలు స్పష్టంగా చెప్పేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక అవకాశం ఇచ్చాయి. వాటిని లిట్మస్ టెస్ట్ గా చూసినా వైసీపీ పట్ల వ్యతిరేకత అయితే జనంలో ఉంది అని అంటున్నారు. దాన్ని లైట్ తీసుకోకూడదు అన్నదే వైసీపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు.

బయటకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు జస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిమిత సంఖ్యలో ఓటర్లు అని చెప్పుకున్నా మార్పు ఎక్కడో స్టార్ట్ అయిందన్న సంకేతం అయితే వైసీపీ అధినాయకత్వం బాగానే గుర్తించింది అని అంటున్నారు.

ఇంకా పూర్తి స్థాయిలో అయితే వ్యతిరకత ప్రబలలేదని అయితే పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రభంజనం రేగడానికి ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చని వైసీపీ పెద్దలు కరెక్ట్ గానే ఊహిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత చిక్కబడకముందే ఎన్నికలకు వెళ్లి టిడిపికి సర్దుకునే టైం ఇవ్వకుండా దెబ్బకొట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఓ నాలుగైదు శాఖలకు మంత్రులను మారుస్తారని అంటున్నారు.