Pakistan Jail: భూకంపం దారి చూపింది!…పాకిస్థాన్ జైలు నుంచి 200మంది ఖైదీల పరారీ!!

Pakistan Jail: భూకంపం దారి చూపింది!…పాకిస్థాన్ జైలు నుంచి 200మంది ఖైదీల పరారీ!!

పాPakistan Jail: పాకిస్తాన్ లో వచ్చిన భూకంపం ఓ జైలులోని ఖైదీలకు తప్పించుకునే మార్గాన్ని చూపింది. కరాచీ ప్రాంతంలో మూడుసార్లు భూమి కంపించింది. దీంతో ఈ ప్రాంతంలోని మాలిర్ బఛా జైలు గోడలు కొన్ని బీటలు వారగా..కొన్ని కూలిపోయాయి. పరిస్థితిని గమనించిన జైలు అధికారులు జైలులో ఉన్న 800మంది ఖైదీల వరకు అక్కడి బ్యారక్ ల నుంచి మరో జైలుకు తరలించారు. ఇదే అదునుగా తీసుకున్న ఖైదీలు అధికారుల కళ్లు గప్పి జైలు నుంచి పరారయ్యారు. 200 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లుగా సమాచారం. అయితే ఖైదీలు తప్పించుకునే క్రమంలో జైలు సిబ్బంది అడ్డుకోగా వారి వద్ధ ఉన్న ఆయుధాలను లాక్కొని పోలీసులపైకి తిరగబడ్డారు. ఈ క్రమంలో ఖైదీలను పట్టుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20మందికి వరకు ఖైదీలు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురు భద్రతాధికారులు కూడా గాయపడ్డారు.

తప్పించుకున్న ఖైదీలలో తీవ్రమైన నేరాల కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లోని నేరస్థులు, మానసిక పరిస్థితి సరిగా లేనివారు ఎక్కువగా ఉన్నారన్నారని అధికారులు తెలిపారు. ఖైదీలను పట్టుకునేందుకు పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. జాతీయ రహదారులతో పాటు వివిధ మార్గాలను మూసివేసి వారి ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నారు. తప్పించుకున్న ఖైదీలలో ఇప్పటికే 100మందికి పైగా తిరిగి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సింధ్ హోంమంత్రి జియా ఉల్ హసన్ లంజార్ మాట్లాడుతూ.. ఖైదీలు కూలిపోయిన గోడ నుంచి కాకుండా ప్రధాన ద్వారం గుండా పారిపోయారని తెలిపారు. జైలు నుంచి పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు, భద్రతా దళాలు వెతుకులాట ప్రారంభించాయని పేర్కొన్నారు. ఇప్పటికే చాలమందిని తిరిగి పట్టుకున్నారని వివరించారు.