ఏపీలోనూ ఈడీ యాక్షన్ రెడీ.. TDP జమానాలో అక్రమాలపై దర్యాప్తు!

విధాత: ప్రస్తుతం తెలంగాణలోని మంత్రులు గంగుల కమలాకర్, కవిత, మల్లారెడ్డి తదితరులను వరుస దాడులు, నోటీసులతో బెంబేలెత్తిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పుడు ఏపీలోనూ యాక్షన్ స్టార్ట్ చేసింది. గత టిడిపి సర్కారు హయాంలో 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల కింద వందల కోట్లు నొక్కేశారన్న అభియోగల మీద ఈడీ ఇప్పుడు ఏకంగా గత ప్రభుత్వంలోని 26 మందికి నోటీసులు ఇచ్చింది. దీంతో టీడీపీ నాయకుల్లో కలవరం బయల్దేరింది. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ […]

  • By: krs    latest    Dec 04, 2022 2:02 PM IST
ఏపీలోనూ ఈడీ యాక్షన్ రెడీ.. TDP జమానాలో అక్రమాలపై దర్యాప్తు!

విధాత: ప్రస్తుతం తెలంగాణలోని మంత్రులు గంగుల కమలాకర్, కవిత, మల్లారెడ్డి తదితరులను వరుస దాడులు, నోటీసులతో బెంబేలెత్తిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పుడు ఏపీలోనూ యాక్షన్ స్టార్ట్ చేసింది. గత టిడిపి సర్కారు హయాంలో 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల కింద వందల కోట్లు నొక్కేశారన్న అభియోగల మీద ఈడీ ఇప్పుడు ఏకంగా గత ప్రభుత్వంలోని 26 మందికి నోటీసులు ఇచ్చింది. దీంతో టీడీపీ నాయకుల్లో కలవరం బయల్దేరింది.

గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ అప్పట్లో రూ.3500 కోట్లు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం చేసుకుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండగా ఇందులో రూ. 241.78 కోట్లు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో ఆ శాఖ మాజీ చైర్మ‌న్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్ట‌ర్ ల‌క్ష్మినారాయ‌ణ‌, ఓఎస్‌డీ కృష్ణప్ర‌సాద్‌తో పాటు మ‌రికొంద‌రికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో సైతం నిధులు మళ్ళించిన విషయాన్నీ ఈడీ గుర్తించింది.

మరో వైపు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న 370 కోట్ల రూపాయలకు బిల్లులను తీసుకున్న సిమేన్ సంస్థ జీఎస్టీని సైతం చెల్లించకుండా పోయింది.ఈ విషయాలు అన్నీ చూసిన ఈడీ రంగంలోకి దిగి ఇద్దరిని ఈ కేసులో అరెస్ట్ కూడా చేసింది.

టీడీపీ ప్రభుత్వ జమానాలో జరిగిన ఈ కుంభకోణం ఇప్పుడు టీడీపీని రాజకీయంగా నష్టపర్చేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీని బదనాం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలూ వైసిపి నాయకులు వినియోగించుకునేందుకు ట్రై చేస్తారు.