ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఇవ్వ‌ని ఎన్నిక‌ల అధికారులు

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్‌లు అందించ‌డం లేద‌ని ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ లివింగ్ సంస్థ కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు ఫిర్యాదు చేసింది

ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ఇవ్వ‌ని ఎన్నిక‌ల అధికారులు
  • కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు ఫిర్యాదు చేసిన ఫోర‌మ్ బెట‌ర్ లివింగ్‌

విధాత‌,హైద‌రాబాద్‌: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్‌లు అందించ‌డం లేద‌ని ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ లివింగ్ సంస్థ కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నిక‌ల అధికారుల నిర్వాకం కార‌ణంగా ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేక పోతున్నార‌ని తెలిపింది. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఓటు కీల‌కం అన్న ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ లివింగ్ సంస్థ పోస్ట‌ల్ బ్యాలెట్ ప‌త్రాలు అంద‌డం లేద‌ని చెపితే

కొందరు ఎన్నికల అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదని త‌మ ఫిర్యాదులో తెలిపింది. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని అధికారులంద‌రికీ పోస్ట‌ల్ బ్యాలెట్ ప‌త్రాలు అందించాల‌ని ఈ సంస్థ కార్య‌ద‌ర్శి డి.వెంట‌రామ‌య్య ఫిర్యాదులో పేర్కొన్నారు.