Elephant | అరటిపళ్లు పెడుతూ గజరాజుతో.. అమ్మడు ఆట.. కట్‌ చేస్తే

Elephant   విధాత : ఏనుగులతో మహా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా ఉన్నంత వరకూ బాగానే ప్రవర్తిస్తాయి. తిక్కరేగిందో ఎత్తిపడేస్తాయి. అలాంటిదే ఈ వీడియో. అరటిపళ్లు పెట్టి గజరాజును మచ్చిక చేసుకుందామని ఓ యువతి ప్రయత్నిస్తే.. సీన్‌ రివర్సయింది. ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద పోస్ట్‌ చేసిన ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది. ‘ఏనుగును మచ్చిక చేసుకున్నా దానిని మీరు మోసం చేయజాలరు. బంధించి ఉంచాల్సిన అత్యంత తెలివైన జంతువులతో ఇది ఒకటి’ అని దీనికి […]

  • Publish Date - April 30, 2023 / 04:50 AM IST

Elephant

విధాత : ఏనుగులతో మహా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా ఉన్నంత వరకూ బాగానే ప్రవర్తిస్తాయి. తిక్కరేగిందో ఎత్తిపడేస్తాయి. అలాంటిదే ఈ వీడియో. అరటిపళ్లు పెట్టి గజరాజును మచ్చిక చేసుకుందామని ఓ యువతి ప్రయత్నిస్తే.. సీన్‌ రివర్సయింది. ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద పోస్ట్‌ చేసిన ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది.

‘ఏనుగును మచ్చిక చేసుకున్నా దానిని మీరు మోసం చేయజాలరు. బంధించి ఉంచాల్సిన అత్యంత తెలివైన జంతువులతో ఇది ఒకటి’ అని దీనికి క్యాప్షన్‌ జోడించారు. వీడియో విషయానికి వస్తే.. ఒక నది ఒడ్డున భారీ ఏనుగు పెద్ద పెద్ద దంతాలతో నిలబడి ఉంటుంది. దాన్ని మచ్చిక చేసుకునేందుకు ఓ యువతి ప్రయత్నిస్తుంది. చేతిలో అరటి గెల పట్టుకుని దానికి తినిపించాలని ప్రయత్నిస్తుంది.

కానీ.. మెల్లగా ముందుకు వచ్చిన ఆ ఏనుగు.. ఉన్నట్టుండి ఆ యువతిని కుమ్మిపడేస్తుంది. ఆ యువతి పరిస్థితి ఏమిటి? దెబ్బలు తగిలాయి? అనే వివరాలు తెలియలేదు కానీ.. దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. అయ్యో ఆ అమ్మాయికి ఏమైందో అని ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా.. గతంలో జరిగిన ఇటువంటి సంఘటనల వీడియోలను మరికొందరు పోస్ట్‌ చేశారు.

ఇటువంటి జంతువులతో జాగ్రత్తగా ఎలా ఉండాలో కొందరు సలహాలు ఇచ్చారు. వాటితో పరాచికాలడకూడదని కొందరు సూచించారు. అడవి ఏనుగులతో జాగ్రత్తగా మెలగాలని, వాటి ఉనికిని గౌరవించాలని కొందరు సలహా ఇచ్చారు.