Elon Musk | ట్విట్ట‌ర్‌లో బేబి ఎలన్ మస్క్ ఫోటో వైర‌ల్‌.. ట్విట్ట‌ర్ బాస్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..!

Elon Musk: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది అనేది మన అరచేతిలోనే తెలుస్తుంది. అలాంటి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ కి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎలన్ మస్క్ ను బేబీగా ఉన్నప్పుడు మీరు చూశారా.. ప్ర‌స్తుతం బేబీ ఎలన్ మస్క్ ఫోటో ఎంతగానో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఎలన్ మస్క్ చాలా క్యూట్ గా ఉన్నారు. ఎలన్ […]

  • By: sn    latest    Jul 09, 2023 9:32 AM IST
Elon Musk | ట్విట్ట‌ర్‌లో బేబి ఎలన్ మస్క్ ఫోటో వైర‌ల్‌.. ట్విట్ట‌ర్ బాస్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..!

Elon Musk:

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది అనేది మన అరచేతిలోనే తెలుస్తుంది. అలాంటి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్ కి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎలన్ మస్క్ ను బేబీగా ఉన్నప్పుడు మీరు చూశారా.. ప్ర‌స్తుతం బేబీ ఎలన్ మస్క్ ఫోటో ఎంతగానో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో ఎలన్ మస్క్ చాలా క్యూట్ గా ఉన్నారు. ఎలన్ మస్క్ మంచి వ్యాపార వేత్త. రీసెంట్ గా మెటా సంస్థ మరో బిగ్గెస్ట్ సోషల్ మీడియా థ్రెడ్స్ ను ట్విట్టర్ కు పోటీగా తీసుకువచ్చిన ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోకు ఎలన్ మస్క్ కూడా రియాక్ట్ అయ్యారు.

ట్విట్టర్ ఖాతాలో ఈ బేబి ఎలన్ మస్క్ ఫోటోను కే10 అనే అకౌంట్ లో షేర్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఎలన్ మస్క్ 7 నుండి 12 నెలల పిల్లాడిగా కనిపిస్తూ.. మంచి స్మైల్ తో పోజులిచ్చాడు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫోటోను యాడ్ చేసి.. ఈ పిల్లాడు కార్ కంపెనీకి బాస్ అని, మార్స్ కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడని, ప్రపంచం మొత్తంలో తిరిగే ఎలక్ట్రిక్ కార్స్ ని తయారు చేసేవాడని పోస్ట్ రాశారు. ఈ క్యాప్షన్ తో ఉన్న పోస్ట్ కు ఎలన్ మస్క్ రియాక్ట్ అవుతూ.. ఈ ఫోటోలో నేను పిచ్చివాడిలా ఉన్నాను అంటూ స్మైల్ కూడా ఇచ్చారు ఎలన్ మస్క్.

ఎలన్ మస్క్ ప్రపంచ ధనవంతుల లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి. మస్క్ అనే పేరు రాగానే ఆయన అమలు చేసే విప్లవాత్మక ఆలోచనలు గుర్తుకు వస్తాయి. ఈయన ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ట్విట్టర్ ను హ్యాండిల్ చేసినప్పటి నుండి ఆయన పేరు సోషల్ మీడియాలో మార్మోగుతుంది.