Elon Musk | ఎలాన్ మ‌స్క్ స్పేస్ ఎక్స్‌లో.. 14 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నియామకం

విధాత‌: ఎప్ప‌టికప్పుడు కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటూ వార్త‌ల్లో నిలిచే ఎలాన్ మ‌స్క్‌ (Elon Musk).. త‌మ ద‌గ్గ‌ర ఉద్యోగంలో చేరాలంటే విద్య‌కు, వ‌య‌సుకు సంబంధం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో 14 ఏళ్ల బాలుడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నియ‌మించుకున్నారు. కైరాన్ క్వాజీ అనే ఈ బాలుడు టెక్నిక‌ల్లీ చాలెంజింగ్, ఫ‌న్ ఇంట‌ర్వ్యూను విజ‌య‌ వంతంగా పూర్తిచేశాడ‌ని సంస్థ ప్ర‌క‌టించింది. ఈ నియామ‌కాన్ని ధ్రువ‌ప‌రుస్తూ కైరాన్ తన లింక్డిన్ ప్రొఫైల్‌నూ […]

Elon Musk | ఎలాన్ మ‌స్క్ స్పేస్ ఎక్స్‌లో.. 14 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నియామకం

విధాత‌: ఎప్ప‌టికప్పుడు కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటూ వార్త‌ల్లో నిలిచే ఎలాన్ మ‌స్క్‌ (Elon Musk).. త‌మ ద‌గ్గ‌ర ఉద్యోగంలో చేరాలంటే విద్య‌కు, వ‌య‌సుకు సంబంధం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో 14 ఏళ్ల బాలుడిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నియ‌మించుకున్నారు. కైరాన్ క్వాజీ అనే ఈ బాలుడు టెక్నిక‌ల్లీ చాలెంజింగ్, ఫ‌న్ ఇంట‌ర్వ్యూను విజ‌య‌ వంతంగా పూర్తిచేశాడ‌ని సంస్థ ప్ర‌క‌టించింది.

ఈ నియామ‌కాన్ని ధ్రువ‌ప‌రుస్తూ కైరాన్ తన లింక్డిన్ ప్రొఫైల్‌నూ అప్‌డేట్ చేశాడు. దాని ప్ర‌కారం అత‌డిని స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ప్రాజెక్టుకు తీసుకున్నారు. ఇది ప్ర‌పంచంలోనే మంచి కంపెనీ.. నైపుణ్యాల‌కు వ‌య‌సుకు సంబంధం ఉంటుంద‌న్న పాత‌కాల‌పు సూత్రాన్ని స్పేస్ ఎక్స్ బ‌ద్ద‌లు కొట్టింద‌ని లింక్డిన్‌లో రాసుకొచ్చాడు.

ఇదీ ఆ బాల మేథావి ప్ర‌యాణం

నిరంత‌రం ఛాలెంజింగ్‌గా ఉంటూ ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం పాటు ప‌డే ప‌ని అంటే ఇష్టం.. ఇదీ కైరాన్ క్వాజీ బ‌యోలో ఉన్న విష‌యం. దీన్ని బట్టే అత‌డు త‌న కెరీర్ ప‌ట్ల ఎంత నిర్దిష్టంగా ఉన్నాడో అర్థ‌మ‌వుతుంది. శాంటా క్లారా యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌నున్న కైరాన్… ఆ యూనివ‌ర్సిటీ నుంచి చిన్న వ‌య‌సులోనే గ్రాడ్యుయేట్ ప‌ట్టా అందుకోనున్న వ్య‌క్తిగా చ‌రిత్ర సృష్టించ‌నున్నాడు. అత‌డికి రెండేళ్ల వ‌య‌సున్న‌పుడే పూర్తి వాక్యాల‌ను అల‌వోక‌గా ప‌లికేసేవాడ‌ని తెలుస్తోంది.

అంతేకాకుండా తొమ్మ‌దేళ్లపుడు త‌న తెలివితేట‌ల‌కు స్కూల్ పాఠాలు చాలా సులువుగా ఉన్నాయ‌ని భావించాడు. వెంట‌నే ఒక ఏఐ రీసెర్చ్ సంస్థ‌లో ఇంట‌ర్న్‌గా జాయిన్ అయి.. త‌న కోడింగ్ స్కిల్స్‌కి మెరుగులు పెట్టుకున్నాడు. అనంత‌రం 11 ఏళ్ల‌కు కంప్యూటర్ సైన్స్ చ‌ద‌వ‌డానికి ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఖాళీ స‌మయాల్లో బాగా ఆట‌లాడ‌తాన‌ని, ఫిలిప్ కె డిక్ సైన్స్ ఫిక్ష‌న్ పుస్త‌కాలు, మైకేల్ లూయిస్ పుస్త‌కాలు బాగా చ‌దువుతాన‌ని కైరాన్ చెప్పుకొచ్చాడు.