Encounter in Karrigutta: కర్రిగుట్టలలో ఎన్ కౌంటర్.. 22మంది మావోయిస్టుల మృతి
Encounter in Karrigutta: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రిగుట్ట లలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్టలపై భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వైపులా నుంచి కాల్పులు ప్రారంభం అయ్యాయి. 22 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనను సీఆర్పీఎఫ్ బస్తర్ వింగ్ ఐజీ సుందర్ రాజ్, పోలీసు ఐజీ రాకేశ్ అగర్వాల్ ధృవీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram