Engineer Shankaranna @ MLA Shankar Naik
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ @ ఇంజినీర్ శంకరన్న గురువారం తన నియోజకవర్గంలోని గాంధీపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి మహబూబాబాద్ వస్తున్నాడు.
ఈ క్రమంలో రోడ్డుపైన ఓ..పెద్ద గుంత కనిపించింది.. దాన్ని అలాగే వదిలేస్తే ప్రమాదం అనే ఆలోచన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వచ్చింది. ఒక్కసారిగా తన వాహనాన్ని ఆపేసి కిందకు దిగాడు. ఆయనలో దాగి ఉన్న పాత ఇంజినీర్ మేల్కొన్నాడు.
ఎమ్మెల్యే కాకముందే బానోత్ శంకర్ నాయక్ ఓ..మంచి ఇంజినీర్.. ఆ..అనుభవంతో కళ్ళతోనే ఓ..అంచనాకు వచ్చారు. మొరం.., రెడ్ మిక్స్ ఫోన్ చేసి తెప్పించాడు. స్వయంగా తానే పార అందుకొని రంగంలోకి దిగారు. తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టారు.
ఇంజినీర్ ఎమ్మెల్యే అక్కడి నుండే అధికారులతో మాట్లాడి తాత్కాలికంగా మేము కొంత పనిచేశామని, శాశ్వతంగా ఈ.. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏదైనా సమస్య కనిపిస్తే ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పందించే తీరేవేరంటూ ఆయన అనుచరులు అంటుండగా ఆ.. రోడ్డు వెంట వెల్లే వాహనదారులు., స్థానికులు అభినందించారు.