విద్యార్థులకు బ్యాడ్ న్యూస్‌: ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు.. 40 కాలేజీల్లో రూ. లక్షకు పైనే?

విధాత: తెలంగాణలోని ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు ఇది బ్యాడ్ న్యూస్‌. ఎందుకంటే ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను ఏకంగా లక్షల రూపాయాలకు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫారసుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ. 45 వేలకు పెంచారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ. లక్ష దాటింది. […]

  • By: krs    latest    Oct 19, 2022 1:36 PM IST
విద్యార్థులకు బ్యాడ్ న్యూస్‌: ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు.. 40 కాలేజీల్లో రూ. లక్షకు పైనే?

విధాత: తెలంగాణలోని ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులకు ఇది బ్యాడ్ న్యూస్‌. ఎందుకంటే ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను ఏకంగా లక్షల రూపాయాలకు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫారసుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ. 45 వేలకు పెంచారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ. లక్ష దాటింది. ఎంజీఐటీలో రూ. 1.6 లక్షలు, సీవీఆర్‌లో రూ. 1.5 లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ. 1.4 లక్షల చొప్పున పెంచారు.

ఈ ఫీజులు మూడేండ్ల పాలు అమల్లో ఉండనున్నాయి. అయితే ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులను కూడా పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కనీస వార్షిక ఫీజు రూ. 27 వేలుగా ఖరారు చేశారు. ఎంటెక్ కనీస వార్షిక ఫీజు రూ. 57 వేలుగా నిర్ణయించారు.