గ‌ణ‌తంత్ర వేడుక‌లు.. అస్వ‌స్థ‌త‌కు గురైన‌ మాజీ హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగుర‌వేశారు.

గ‌ణ‌తంత్ర వేడుక‌లు.. అస్వ‌స్థ‌త‌కు గురైన‌ మాజీ హోం మంత్రి మ‌హ‌ముద్ అలీ

హైద‌రాబాద్ : తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగుర‌వేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం మ‌హ‌ముద్ అలీ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. నిల్చున్న అత‌ను స్పృహ కోల్పోయారు. దీంతో త‌న‌ ప‌క్క‌న ఉన్న ఓ నాయ‌కుడిపై ప‌డిపోయారు. అప్ర‌మ‌త్త‌మైన కేటీఆర్, ఇత‌ర నాయ‌కులు మ‌హ‌ముద్ అలీని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌హ‌ముద్ అలీ ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రాలు తెలియాల్సి ఉంది