హామీలు అమలు చేయండి.. సమ్మెకు దిగిన VRAలు

VRA విధాత:  సమ్మె సందర్భగా తమకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ ఆధ్యర్వంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన వీఆర్‌ఏలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని తాము కోరుతున్నాము తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. వీఆర్ఏల […]

  • Publish Date - February 1, 2023 / 01:15 PM IST

VRA

విధాత: సమ్మె సందర్భగా తమకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ ఆధ్యర్వంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన వీఆర్‌ఏలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని తాము కోరుతున్నాము తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. వీఆర్ఏల ధర్నా నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

వీఆర్ ఏ ల డిమాండ్లు ఇవే..

  • అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు సీఎం హామీ ఇచ్చిన పే స్కేల్ అమలు చేయాలి.
  • 55 ఏళ్లు దాటినవారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలి.
  • అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి
  • 50 రోజుల సమ్మె కాలానికి వేతనం చెల్లించాలి.
  • సమ్మె కాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి