2కోట్ల నకిలీ మైసూర్ శాండల్స్ సబ్బుల పట్టివేత
కర్ణాటక ప్రభుత్వ యాజమాన్యంలోని కేఎస్‌డీఎల్‌కు చెందిన మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసి విక్రయిస్తున్న నకిలీ యూనిట్‌ను హైదరాబాద్‌లో గుర్తించారు

విధాత : కర్ణాటక ప్రభుత్వ యాజమాన్యంలోని కేఎస్‌డీఎల్‌కు చెందిన మైసూర్ శాండల్ సబ్బును తయారు చేసి విక్రయిస్తున్న నకిలీ యూనిట్‌ను హైదరాబాద్‌లో గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ.2 కోట్ల విలువైన నకిలీ మైసూర్ శాండల్స్ సబ్బులు, నకిలీ ఉత్పత్తులు, వస్తువులు, ప్యాకింగ్‌కు ఉపయోగించే కాటన్ బాక్సులను గుర్తించారు. నకిలీ మైసూర్ శాండల్స్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సబ్బుల రంగంలో రకరకాల సబ్బుల ఉత్పత్తులు వచ్చినా మైసూర్ శాండల్స్ ప్రత్యేకత దానికదే అన్నట్లుగా ఆ కంపనీ సబ్బును వాడే అభిమానులున్నారు. తాజాగా హైద్రాబాద్‌లో భారీగా నకిలీ మైసూర్ శాండల్స్ సబ్బులు బయపడటంతో తాము వాడుతున్న మైసూర్ శాండల్స్ సబ్బులు అసలువో నకిలీలో తెలియక వారంతా అయోమయంలో పడ్డారు.
