Warangal: నకిలీ వే బిల్లుల తయారీ ముఠా అరెస్ట్

అక్రమ ఇసుక రవాణాతో ఖజానాకు భారీ గండి నిందితులను అరెస్ట్ చేసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు సిబ్బందిని అభినందించిన సీపీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నకిలీ వే బిల్లులు తయారు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 16 లారీలను సీజ్ చేసి వారి నుంచి నకిలీ వే బిల్లులు, లాప్టాప్, సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను […]

Warangal: నకిలీ వే బిల్లుల తయారీ ముఠా అరెస్ట్
  • అక్రమ ఇసుక రవాణాతో ఖజానాకు భారీ గండి
  • నిందితులను అరెస్ట్ చేసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • సిబ్బందిని అభినందించిన సీపీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నకిలీ వే బిల్లులు తయారు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 16 లారీలను సీజ్ చేసి వారి నుంచి నకిలీ వే బిల్లులు, లాప్టాప్, సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు నకిలీ వే బిల్లులను సృష్టించి దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని చెప్పారు. ఇలాంటి ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

అరెస్ట్ అయిన వారిలో ఎదుల కిరణ్ కుమార్ (37) పుట్టపాక గ్రామం, నారాయపూర్ మండలం, యదాద్రి భువనగిరి జిల్లా, షేక్ ఇమ్రాన్(28) పేరూర్ గ్రామం, వాజేడు మండలం, ములుగు జిల్లా, గంట ప్రదీప్ రెడ్డి @ సందీప్ రెడ్డి, తండ్రి పేరు సంపత్ రెడ్డి(28) భరత్ నగర్, ఉప్పల్, హైదరాబాద్, మంచిల్ల వెంకటేశ్ (22) కొత్త‌పల్లి గ్రామం, భీమదేవరపల్లి మండలం వీరిని టాస్క్ ఫోర్స్, మట్వాడ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్, 16 TSMDC స్టంప్స్, 1 లాప్ టాప్, 11 సెలఫోన్ లు, రూ.41వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మూడేళ్లుగా ఖజానాకు గండి

పోలీసులు నకిలీ వే బిల్లులు తయారు చేస్తున్న కిరణ్ కుమార్‌ను విచారించగా అతను గత 3 సంవత్సరాల నుండి తయారు చేస్తూ వాటిని లారీ యజమానులకు ఇస్తున్నాడు. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 1700 వరకు తయారుచేసి ఇచ్చాడు.

వాటిని ఉపయోగించి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని క్వారీల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానకు రావలసిన సుమారు రూ.౩౦ కోట్ల ఆదాయాన్ని కొల్లగొట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మట్వాడ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ మరియు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు.

ఈ కేసులో ప్రతిభ కనబరిచిన టాస్క్‌ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, మట్వాడ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, ధర్మసాగర్ ఎస్.ఐలు శంకర్, ఫిలిప్ రాజు, విజయ్, టాస్క్ఫోర్స్ ఎస్.ఐ లు లవణ్ కుమార్, నిస్సార్ పాషా టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్‌ స్వర్ణలత, కానిస్టేబుల్లు సురేష్, శ్యాం, నవీన్, కరుణాకర్, ప్రభాకర్, రాజేందర్ రెడ్డి, భిక్షపతి, రాజేష్, రాజు, శ్రీను, శ్రవణ్, నాగరాజును సీపీ అభినందించారు.