Chandrababu | అయన కాలంలో నిర్మించిన బ్లాకులోనే.. ఆయన్ను ఉంచారు: చంద్రబాబును కలిసిన భార్య, కుటుంబం

Chandrababu విధాత: స్కిల్ డెవలప్మెంట్ అవినీతిలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును భార్యభువనేశ్వరి, కుమారుడు లోకేష్. కోడలు బ్రహ్మీణి . బాలయ్య బాబు చిన్నకుమార్తె తేజస్విని ఆమె భర్త శ్రీ భారత్ కాసేపటి క్రితం కలిశారు. అయన ఆరోగ్యం కోసం వాకబు చేశారు. తరువాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఇది తమ కుటుంబానికి కష్టకాలమని అన్నారు. అయన కాలంలో నిర్మించిన బ్లాకులోనే ఆయన్ను ఉంచడం విధి రాత అన్నట్లుగా మాట్లాడారు. […]

  • By: Somu    latest    Sep 12, 2023 12:45 PM IST
Chandrababu | అయన కాలంలో నిర్మించిన బ్లాకులోనే.. ఆయన్ను ఉంచారు: చంద్రబాబును కలిసిన భార్య, కుటుంబం

Chandrababu

విధాత: స్కిల్ డెవలప్మెంట్ అవినీతిలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును భార్యభువనేశ్వరి, కుమారుడు లోకేష్. కోడలు బ్రహ్మీణి . బాలయ్య బాబు చిన్నకుమార్తె తేజస్విని ఆమె భర్త శ్రీ భారత్ కాసేపటి క్రితం కలిశారు. అయన ఆరోగ్యం కోసం వాకబు చేశారు. తరువాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఇది తమ కుటుంబానికి కష్టకాలమని అన్నారు. అయన కాలంలో నిర్మించిన బ్లాకులోనే ఆయన్ను ఉంచడం విధి రాత అన్నట్లుగా మాట్లాడారు.

మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడాలని, ప్రజలే తనకు ముఖ్యమని జైలు నుoచి వచ్చిన తరువాత వారికీ అండగా ఉంటానని అన్నారని నేను బాగున్నానని.. మీరు భయపడవద్దన్నారని తెలిపినట్లు భువనేశ్వరి పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. నా భర్త భద్రతపై అనుమానం ఉందని, సౌకర్యాలు సరిగా లేవని అన్నారు. స్నానానికి వేడి నీరివడం లేదని చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారని తెలిపారు.

మరోవైపు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచాలంటూ అయన తరఫు న్యాయమూర్తులు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కాగా.. అయన భద్రతా దృష్ట్యా గృహ నిర్బంధంలో ఉంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా. రాజమండ్రి సెంట్రల్ జైలును మించిన భద్రతా ఎక్కడ ఉండదని, ఆయనకు వేరే బ్లాక్ ఉంటుందని, కరడుగట్టిన నేరస్తులు, మావోయిస్టులు ఈయనకు దూరంగా ఉంటారని ఈయనకు ప్రత్యేక భద్రతా కల్పిస్తూ 24 గంటలు సీసీ టివి కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు.

దీంతో వీరి వాదనతో ఏకీభవించిన సీఐడీ కోర్టు ఆయన్ను హౌస్ కష్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది. మరోవైపు ఆయన్ను తమ కష్టడీకి ఇస్తే విచారిస్తామని, కుంభకోణాలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబడతాం అని సీఐడీ సైతం కోర్టులు పిటిషన్ వేసింది.