కుటుంబ పార్టీలు ప్రజల మేలు తలచవు: పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ

- కుటుంబ పార్టీలు ప్రజల మేలు తలచవు
- తెలంగాణ ప్రగతి బీజేపీతోనే సాధ్యం
- కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే
- సాగునీటీ పథకాల పేరుతో భారీ దోపిడి
- పార్టీలను ప్రవైటు లిమిటెడ్ కంపనీలుగా మార్చారు
- తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు
- పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ
విధాత , కాంగ్రెస్, బీఆరెస్‌లు రెండు కుటుంబ పార్టీలని, అవి వారి కుటుంబాల కోసమే తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పనిచేయవని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఆదివారం పాలమూరు బీజేపీ పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరై ప్రసంగించారు. కుటుంబ, వారసత్వ పార్టీలు రాజకీయ పార్టీలను ఫ్రైవేటు లిమిటెడ్ కంపనీలుగా మార్చాయని, వాటిలో అన్ని కీలక పదవులు కుటుంబ సభ్యులకే ఉంటాయని కుటుంబ పార్టీలు కమిషన్, కరప్షన్ అనే ఒకే ఫార్ములాతో పనిచేస్తాయని దుయ్యబట్టారు. బీజేపీ సామాన్యుడి కుటుంబం కోసం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల మేలు కోసం ఆలోచించే నమ్మకమైన పారదర్శకమైన అవినీతి రహితమైన పాలనను బీజేపీ మాత్రమే అందిస్తుందన్నారు.
తెలంగాణలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, మహిళలు, రైతులు, పేదలు, యువత అంతా కూడా మోడీ ఇచ్చే గ్యారంటీ పైన ఎంతో నమ్మకముందని భావిస్తున్నారన్నారు. మోడీ ఇచ్చే ప్రతిహామీని నేరువేర్చుతారని, మీరంతా బీజేపీని ఆశీర్వదించి తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో బీఆరెస్ పార్టీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని అందరికి తెలుసన్నారు. బీఆరెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పాలమూరు ఫ్రజల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్, బీఆరెస్ నేతలకు నిధ్రపట్టదని, ఖచ్చితంగా తెలంగాణ ఫ్రజలు మార్పు కోరుకుంటున్నాని తెలుస్తోందన్నారు. అవినీతి రహితంగా పనిచేసే ప్రభుత్వం కోసం వారు కోరుకుంటున్నారని, అబద్ధాలతో మభ్యపెట్టె మోసపూరిత, తప్పుడు వాగ్ధాానాలతో సాగుతున్న పాలన స్థానంలో అవినీతి రహిత, పారదర్శక, నమ్మకమైన పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
రాణిరుద్రమ దేవి వంటి వారు పుట్టిన తెలంగాణ గడ్డ గొప్పదని, తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించారని, తమను ఆదరించిన మహిళల అభ్యున్నతిని కాంక్షిస్తూ 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు నారీశక్తి వందన్ అధియాన్ ఆమోదింపచేసి చట్టసభల్లో మహిళకు తగిన గౌరవం, ప్రాతినిధ్యం లభించేలా చేశామన్నారు. ఢిల్లీలో ఓ సోదరుడు మీ జీవితాలను మెరుగు పరుచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని మహిళా సోదరిమణులు మరువరాదన్నారు. మహిళ సంక్షేమానికి ముద్ర రుణాలతో, పీఎం ఆవాజ్ యోజన కింద ఇండ్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి 13500కోట్ల నిధులతో అభివృద్ధి పనులు మంజూరు చేసుకున్నామని, వాటికి శంకుస్థాపనలు చేసుకున్నామని, భవిష్యత్తులో తెలంగాణ యువతకు వాటి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
తెలంగాణలో 2014వరకు 2,500కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తే తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వంతో లక్ష కోట్లతో అదనంగా 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామన్నారు. కులవృత్తులు, వ్యాపారులు, ఉద్యోగులు, రైతుల అభివృద్ధికి ఈ రహదారుల వసతి దోహదం చేస్తుందనన్నారు. 2014కు పూర్వం 3400కోట్లు ధాన్యం మద్ధతు ధరకు వెచ్చిస్తే ఒక్క ఏడాదికి 25వేల కోట్లు తమ ప్రభుత్వం వెచ్చింందన్నారు. ఇది గతం కంటే ఎనిమిది రేట్లు ఎక్కువ అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం 10వేల కోట్ల నిధులను నేరుగా రైతులకు అందిస్తుందన్నారు. రైతు పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అక్రమార్జనకు పాల్పడుతుందని ప్రధాని మోడీ విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీ దోపిడీ చేస్తుందన్నారు. ప్రారంభోత్సవాలు, ఫ్రచారా ఆర్భాటాలు మినహా కాలువల్లో నీళ్లు పారవని, రైతుల భూములకు నీళ్లు అందవని మోడీ విమర్శించారు.
రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యల సాగుతున్నాయన్నారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయకపోయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రామగుండం ఎరువుల కంపనీని 6,500కోట్లు ఖర్చు చేసి తెరిపించామన్నారు. దేశంలో పసుపు ఉత్పత్తిలో, వినియోగం, ఎగుమతి రెట్టింపు అయ్యిందని, ఇప్పటికే సుగంధ ద్రవ్యాల బోర్డు పనిచేస్తుందని, తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చే గొప్ప కానుకగా తాను భావిస్తున్నానన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన, ఆదివాసీల సంక్షేమాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తుందని, కేంద్రం వారి అభివృద్ధి కోసం సమ్మక్క సారక్క పేరుతో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తుందన్నారు. 900కోట్లతో ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతి, హస్త కళల నైపుణ్యాలు ఎంతో గొప్పవని, తాను దక్షిణాఫ్రికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడిగా తెలంగాణ బిధ్రి కళాఖండాన్ని అందించగా అది ప్రపంచంలో ఎంతో విశిష్టతను సంతరించుకుందన్నారు. చేనేత, చేతి వృత్తిదారుల అభ్యున్నతికి విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తున్నామని, తద్వారా చేతివృత్తిదారులకు ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్ వసతులు అందిస్తున్నాన్నారు.