Minister Niranjan Reddy | అమెరికాలో ప్రతిష్టాత్మక ‘వ్యవసాయ ప్రగతి ప్రదర్శన’.. నిరంజన్ రెడ్డికి ఆహ్వానం

29 నుంచి మూడు రోజుల పాటు ఏర్పాటు రాష్ట్ర మంత్రి సింగిరెడ్డికి ఆహ్వానం Minister Niranjan Reddy | విధాత: అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ లో ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మక ‘వ్యవసాయ ప్రగతి ప్రదర్శన’ (Farm Progress Show) ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) తెలిపారు. ఈ మేరకు శనివారం వ్యవసాయ ప్రదర్శన వివరాలను మంత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు. […]

  • By: Somu    latest    Aug 19, 2023 12:31 AM IST
Minister Niranjan Reddy | అమెరికాలో ప్రతిష్టాత్మక ‘వ్యవసాయ ప్రగతి ప్రదర్శన’.. నిరంజన్ రెడ్డికి ఆహ్వానం
  • 29 నుంచి మూడు రోజుల పాటు ఏర్పాటు
  • రాష్ట్ర మంత్రి సింగిరెడ్డికి ఆహ్వానం

Minister Niranjan Reddy | విధాత: అమెరికాలోని ఇల్లినాయిస్ డెకాటూర్ లో ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మక ‘వ్యవసాయ ప్రగతి ప్రదర్శన’ (Farm Progress Show) ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) తెలిపారు. ఈ మేరకు శనివారం వ్యవసాయ ప్రదర్శన వివరాలను మంత్రి పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్త వ్యవసాయ పరిశ్రమలో అత్యంత అధునాతన వ్యవసాయ ఉత్పత్తులు, సాంకేతికత, వ్యవసాయ రసాయనాలు, పరికరాలు, విత్తన సాంకేతికతపై ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి సింగిరెడ్డి తెలిపారు. పదేళ్లకాలంలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత, నకిలీ విత్తనాలు, పెరుగుతున్న పెట్టుబడులు ప్రధాన సమస్యగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అధిగమించేందుకు ఆధునిక సాంకేతికత, నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, పెట్టుబడులను తగ్గించడం, రైతు పండించిన ఉత్పత్తులకు అధిక ధరలను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టిందని పేర్కొన్నారు.

అత్యధిక శాతం జనాభాకు ఉపాధినిచ్చే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చాలని ముఖ్యమంత్రి ఆశయమని మంత్రి తెలిపారు. అమెరికాలో జరగనున్న వ్యవసాయ ప్రదర్శన.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనకు తోడ్పడుతుందని భావిస్తున్నామన్నారు. అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వ్యవసాయ ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం తరపున తనకు ఆహ్వానం అందినట్లు మంత్రి తెలిపారు.