దేశ రైతాంగం.. KCR నాయకత్వాన్ని కోరుతుంది: గుత్తా సుఖేందర్ రెడ్డి
విధాత: యావత్ దేశ రైతాంగం ఈనాడు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి ఆయన చేపట్టిన పథకాలు దేశ రైతాంగం తమ రాష్ట్రాల్లోనూ అమలు కావాలని ఆశిస్తుందని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, ఏ రాష్ట్రంలో ,లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి […]

విధాత: యావత్ దేశ రైతాంగం ఈనాడు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి ఆయన చేపట్టిన పథకాలు దేశ రైతాంగం తమ రాష్ట్రాల్లోనూ అమలు కావాలని ఆశిస్తుందని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు లతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, ఏ రాష్ట్రంలో ,లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మన రాష్టములోనే అమలు అవుతున్నాయన్నారు.
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే నన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తమ రాష్ట్రాల్లో అమలుకోవాలని అక్కడి రైతులు కోరుతూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ వ్యవస్థను బ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తు న్నారన్నారు. కేవలం విమర్శలు చేయడం, తిట్టడం ద్వారానే వారు గొప్పదనం వస్తుందని అనుకుంటు న్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలో మొదటి స్థానంలో ఉన్నదని, ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ, ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. హైదరాబాదుకు ఇండస్ట్రియల్, ఐటీ, కంపెనీలు రావడానికి మంత్రి కేటీఆర్ కృషి చాలా ఉందన్నారు.