104 ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి: ఫసియోద్యం

  • Publish Date - October 5, 2023 / 10:57 AM IST
  • డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట దీక్షలు


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: జిల్లాలో పనిచేస్తున్న 104 ఎఫ్ డీహెచ్ఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం ఆరు నెలలుగా బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫసియోద్యం డిమాండ్ చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను పర్మనెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.



సమాన పనికి సమాన వేతనం, సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు అందక కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా, తమపై అధికారులు బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో నాయకులు యాద నాయక్, విజయవర్ధన్, రాజు, భూపాల్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.