Chhattisgarh | తండ్రికి పోలీసు దెబ్బలు.. కొడుకు ఆత్మహత్య!

Chhattisgarh | పోలీసులు తండ్రిని హింసిస్తున్న తీరును చూసి తల్లడిల్లిపోయాడు ఓ కొడుకు. అకారణంగా పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నాడని కుంగిపోయాడు. తండ్రిని రక్షించుకొనే మార్గం కనిపించక తన చావే అతనికి విముక్తి కలిగిస్తుందనుకొని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌ జిల్లా పోలీస్‌ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది ఈ ఘటన. 23 ఏండ్ల యువకుడు మోటార్‌ సైకిల్‌పై వెళ్తూ దారిన వెళ్తున్న మహిళలను ఢీ కొట్టాడు. దీంతో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు […]

  • By: krs    latest    Dec 01, 2022 2:39 PM IST
Chhattisgarh | తండ్రికి పోలీసు దెబ్బలు.. కొడుకు ఆత్మహత్య!

Chhattisgarh | పోలీసులు తండ్రిని హింసిస్తున్న తీరును చూసి తల్లడిల్లిపోయాడు ఓ కొడుకు. అకారణంగా పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నాడని కుంగిపోయాడు. తండ్రిని రక్షించుకొనే మార్గం కనిపించక తన చావే అతనికి విముక్తి కలిగిస్తుందనుకొని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌ జిల్లా పోలీస్‌ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది ఈ ఘటన. 23 ఏండ్ల యువకుడు మోటార్‌ సైకిల్‌పై వెళ్తూ దారిన వెళ్తున్న మహిళలను ఢీ కొట్టాడు. దీంతో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయటంలో పోలీసులు యువకున్నిఅరెస్టు చేసేందుకు ఇంటికి వచ్చారు. ఈ ఘటనతో భయపడిన యువకుడు అక్కడి నుంచి ప‌రారయ్యాడు.

ఘటనకు బాధ్యుడు దొరకలేదన్న కోపంతో పోలీసులు తండ్రిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకుపోయి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న యువకుడు. తన తండ్రిని రక్షించే మార్గం తెలియక పరుగులు తీస్తున్న రైలుకు ఎదురెళ్లి ప్రాణం తీసుకొన్నాడు. జరిగిన ఘటన పత్రికల్లో రావటంతో.. జాతీయ మానవ హక్కుల సంస్థ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.

సుమోటో కేసుగా తీసుకొని జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఛత్తీస్‌గఢ్‌ డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. పోలీసుల అతి కారణంగానే అమాయక యువకుడు ప్రాణం తీసుకొనే పరిస్థితి తలెత్తిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అకారణంగా తండ్రిని చిత్రహింసలకు గురి చేయటాన్నిగర్హిస్తున్నారు.