ప్రేమలో మునిగిన కూతుళ్లు.. ఓ బిడ్డను చంపిన తండ్రి
విధాత: కంటికి రెప్పలా కూతుళ్లను పెంచాడు. వారిని ఉన్నతంగా ఉంచాలనుకున్నాడు. వారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేశాడు. కానీ ఆ ఇద్దరు కుమార్తెలు ప్రేమలో పడిపోయారు. పెద్ద కూతురేమో.. కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండో కూతురు కూడా అదే బాట పట్టింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన తండ్రి.. చిన్న కూతురును అతి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన వైజాగ్‌లోని రెల్లి వీధిలో నిన్న చోటు చేసుకుంది. […]

విధాత: కంటికి రెప్పలా కూతుళ్లను పెంచాడు. వారిని ఉన్నతంగా ఉంచాలనుకున్నాడు. వారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేశాడు. కానీ ఆ ఇద్దరు కుమార్తెలు ప్రేమలో పడిపోయారు. పెద్ద కూతురేమో.. కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండో కూతురు కూడా అదే బాట పట్టింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన తండ్రి.. చిన్న కూతురును అతి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన వైజాగ్‌లోని రెల్లి వీధిలో నిన్న చోటు చేసుకుంది.
రెల్లి వీధికి చెందిన వర ప్రసాద్(54) అనే అంబులెన్స్ డ్రైవర్‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. 13 సంవత్సరాల నుంచి భార్య ప్రసాద్‌కు దూరంగా ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, తండ్రి వద్దే ఉంటున్నారు. అయితే పెద్ద కూతురు ఓ యువకుడిని ప్రేమించింది. తండ్రికి తెలియకుండా అతడితో లేచిపోయింది.
ఇక రెండో కూతురు కూడా.. అదే వీధికి చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఈ విషయం తండ్రికి తెలిసింది. ఇద్దరు కూతుర్లు కూడా ప్రేమలో పడిపోవడంతో.. ఈ విషయాన్ని తండ్రి జీర్ణించు కోలేక రెండో కూతుర్ని నిన్న ఇంట్లోనే చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీసి.. తానే తన బిడ్డను చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.