ఫైబర్ గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్!
విధాత: వంట గ్యాస్ సిలిండర్ అనగానే సహజంగా మనకు ఇనుముతో తయారు చేసినదే కనిపిస్తుంది. ఈ గ్యాస్ బండ బరువు కూడా ఎక్కువే ఉంటుంది. ఆడవాళ్లకైతే మరొకరు సాయం చేయాల్సిందే. ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. ఇండియన్ గ్యాస్ కంపెనీ ఫైబర్ గ్యాస్ బండలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో ఎంత గ్యాస్ వాడుకున్నామో చూసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ సిలిండర్ గ్యాస్‌తో కలిపి దాదాపు 30 కిలోలు ఉంటుంది. దీన్ని మోసుకెళ్లడం కష్టతరమే. వంట చేస్తున్నప్పుడు ఉన్నపళంగా […]

విధాత: వంట గ్యాస్ సిలిండర్ అనగానే సహజంగా మనకు ఇనుముతో తయారు చేసినదే కనిపిస్తుంది. ఈ గ్యాస్ బండ బరువు కూడా ఎక్కువే ఉంటుంది. ఆడవాళ్లకైతే మరొకరు సాయం చేయాల్సిందే. ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. ఇండియన్ గ్యాస్ కంపెనీ ఫైబర్ గ్యాస్ బండలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో ఎంత గ్యాస్ వాడుకున్నామో చూసుకునే అవకాశం ఉంటుంది.
సాధారణ సిలిండర్ గ్యాస్‌తో కలిపి దాదాపు 30 కిలోలు ఉంటుంది. దీన్ని మోసుకెళ్లడం కష్టతరమే. వంట చేస్తున్నప్పుడు ఉన్నపళంగా గ్యాస్ అయిపోయిన సంగతి కచ్చితంగా తెలిసేది కాదు. అంతేకాదు ఏజెన్సీల నుంచి వచ్చే గ్యాస్ నిర్దేశించిన ప్రకారం ఉంటుందో లేదో తెలియదు.
ఈ సమస్యలన్నీ ముగింపు పలుకుతూ ఇండియన్ గ్యాస్ కంపెనీ ఫైబర్ గ్యాస్ సిలిండర్ర్లను అందుబాటులోకి తెచ్చింది. 16 కిలోలతో ఉండే ఈ సిలిండర్ ఐరన్ బండ కంటే తక్కువ బరువు ఉంటుంది. సిలిండర్‌లో గ్యాస్ ఎంత వరకు ఉన్నదని అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉన్నది. ఇండియన్ గ్యాస్ కంపెనీ వాళ్లు తీసుకున్న నిర్ణయంపై గృహిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలినా నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ చెబుతున్నది. ఇప్పటికే ఐరన్ గ్యాస్ సిలండర్ ఉన్నవాళ్లు మార్పిడి చేసుకోవాలంటే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.